ఫైనల్‌పై గురిపెట్టి..
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్-ఏ ఫైనల్ బెర్తుపై గురి పెట్టింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బలమైన శ్రీలంకతో తలపడనుంది.
- నేడు శ్రీలంకతో భారత్-ఏ సెమీస్ ఫైట్
- మ 3.30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్లో భారత్-ఏ ఫైనల్ బెర్తుపై గురి పెట్టింది. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో బలమైన శ్రీలంకతో తలపడనుంది. యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు బాదిన సూర్యవంశీ పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత జట్టును మళ్లీ విజయాల బాట పట్టించాడు. అయితే ఫైనల్ చేరుకోవాలంటే కేవలం ఒక్కరిపైనే ఆధారపడకుండా సమష్టిగా రాణించాలని తిలక్సేన భావిస్తోంది. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నేపాల్‌ను 26కే కుప్పకూల్చిన భారత బౌలర్లు ఆ తర్వాత పరుగులను కట్టడి చేయడంలో తడబడ్డారు. పాకిస్థాన్‌కు 300 పైచిలుకు పరుగులు ఇచ్చుకోవడం భారత ఓటమికి ప్రధాన కారణమైంది.
ఈ నేపథ్యంలో సెమీఫైనల్లో పేసర్లు ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా నుంచి మరింత కట్టుదిట్టమైన బౌలింగ్ అవసరమని జట్టు ఆశిస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ల ఫామ్ జట్టును కలవరపెడుతోంది.యువ ఆటగాడు ఆయుష్ బదోని (2, 0), రింకూ సింగ్ (9, 6, 27*) స్థాయికి తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంది. టోర్నీలో రెండు శతకాలు చేసిన కెప్టెన్ తిలక్ అదే జోరు కొనసాగించడంతో పాటు మరింత దూకుడుగా ఆడాలని భావిస్తున్నాడు. మరోవైపు అజేయంగా సెమీస్ చేరిన శ్రీలంక ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో నిషాన్ మదుష్క, లసిత్, కెప్టెన్ పవన్ రత్నాయకే నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో సహన్ సత్తా చాటుతున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

