గేమింగ్ ముసుగులో లక్ష కోట్ల దందా!
ఆన్లైన్ గేమింగ్ ముసుగులో సాగుతున్న భారీ ఆర్థిక లావాదేవీల గుట్టురట్టు చేసేందుకు కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, విజయవాడల్లో ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లు, వారికి ఆర్థిక లావాదేవీల్లో సహకరిస్తున్న ఫైనాన్షియర్ల స్థావరాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు బుధవారం మళ్లీ సోదాలు నిర్వహించారు. పేమెంట్ గేట్‌వేల ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన అధికారులు..
- హైదరాబాద్, విజయవాడల్లో డీజీజీఐ మెరుపు సోదాలు
- చైనా సంస్థలతో కలిసి ఆన్లైన్ గేమింగ్ యాప్‌ల నిర్వహణ
- రూ.వేల కోట్లు అక్రమంగా తరలింపు.. జీఎస్టీ ఎగవేతపై దర్యాప్తు
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ గేమింగ్ ముసుగులో సాగుతున్న భారీ ఆర్థిక లావాదేవీల గుట్టురట్టు చేసేందుకు కేంద్ర జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్, విజయవాడల్లో ఆన్లైన్ గేమింగ్ ఆపరేటర్లు, వారికి ఆర్థిక లావాదేవీల్లో సహకరిస్తున్న ఫైనాన్షియర్ల స్థావరాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు బుధవారం మళ్లీ సోదాలు నిర్వహించారు. పేమెంట్ గేట్‌వేల ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల మేర లావాదేవీలు జరిగినట్టు గుర్తించిన అధికారులు.. వాటి వెనుక ఉన్న ఆర్థిక నెట్వర్పై దృష్టి సారించారు. హైదరాబాద్ కేంద్రంగా కొన్ని సంస్థలు చైనా ఆపరేటర్ల సహకారంతో నాలుగు ఆన్లైన్ గేమింగ్ యాప్‌లను నిర్వహిస్తున్నట్టు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.
సూపర్ విన్నర్, బిగ్ రమ్మీ విన్నర్, బిగ్ లకీ విన్నర్, రమ్మీ రూలర్ పేర్లతో ఈ యాప్‌లు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఈ రకంగా వచ్చిన మొత్తాలను క్రిప్టో కరెన్సీ, ముఖ్యంగా యూఎస్డీటీ రూపంలో చైనా, దుబాయ్, సింగపూర్ వంటి ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే విజయవాడకు చెందిన గాలి కిరణ్‌కుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నట్టు గుర్తించిన అధికారులు.. ఈ వ్యవహారంలో ఆయన పాత్రపై విచారణ చేపట్టారు. హైదరాబాద్, విజయవాడల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫస్ట్ ఫైనాన్స్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎండీ సత్యనారాయణ ఇటాకరి పాత్రపైనా అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

