రామగుండంలో పంప్డ్ స్టోరేజీ ప్లాంట్
రాష్ట్రంలో మూతపడ్డ బొగ్గు గనులను తిరిగి వినియోగంలోకి తెచ్చి, వాటిని ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు సింగరేణి సంస్థ కసరత్తు చేస్తున్నది. ఇందులోభాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేట్ సంస్థలు, డెవలపర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆసక్తి గలవారు డిసెంబర్ 10లోగా ప్రతిపాదనలు సమర్పించేందుకు అవకాశం కల్పించింది.
- 500 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు
- దరఖాస్తులను ఆహ్వానించిన సింగరేణి
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూతపడ్డ బొగ్గు గనులను తిరిగి వినియోగంలోకి తెచ్చి, వాటిని ఆదాయ వనరులుగా మార్చుకునేందుకు సింగరేణి సంస్థ కసరత్తు చేస్తున్నది. ఇందులోభాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండంలో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి గల ప్రైవేట్ సంస్థలు, డెవలపర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆసక్తి గలవారు డిసెంబర్ 10లోగా ప్రతిపాదనలు సమర్పించేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆర్జీ-1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిని ఎంపిక చేసింది. ఈ గనిలో ఇప్పటికే తవ్వకాలు పూర్తవడంతో దాదాపు 158 మీటర్ల లోతైన భారీ గుంత ఏర్పడింది.
దీనిని దిగువ జలాశయంగా వినియోగించుకుని పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. ఈ గుంతలో సుమారు కోటి ఘనపు మీటర్ల (10 ఎంసీఎం) నీటిని నిల్వ చేయవచ్చు. గని పరిసరాల్లోని ఓవర్ బర్డెన్ డంప్ ప్రాంతం, ఎత్తయిన భూముల్లో ఎగువ జలాశయాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అవసరాల కోసం సింగరేణి 142.69 హెక్టార్ల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్టును రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని సింగరేణి నిర్ణయించింది. ప్రాజెక్టు జీవితకాలాన్ని 40 ఏండ్లుగా నిర్ణయించింది. సింగరేణి మాత్రం గని గుంతను, అవసరమైన భూమిని, ప్రీ-ఫీజిబిలిటీ నివేదిక (పీఎఫ్ఆర్)ను అందించనున్నది. ఈ ప్రాజెక్టుకు తమ నుంచి ఎలాంటి మూలధన పెట్టుబడి, ఈక్విటీ వాటా లేదా ఆర్థిక గ్యారంటీ ఉండబోదని సింగరేణి స్పష్టం చేసింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

