సంక్రాంతి బరిలో విశ్వంభర?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ విడుదలపై మరోసారి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. సంక్రాంతి లక్ష్యంగానే నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారని అంటున్నారు. అయితే ఈ విషయంలో చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలావుండగా చిరంజీవి తాజా చిత్రం ‘కాకా’ సంక్రాంతి బరిలో జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ గతంలోనే వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ‘విశ్వంభర’ చిత్రం సైతం సంక్రాంతి బరిలోనే రాబోతుందన్న వార్తలు మెగాభిమానుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. అయితే ఈ వార్తల వెనక నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే. వశిష్ట దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ స్థాయిలో ‘విశ్వంభర’ చిత్రాన్ని తెరకెక్కించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సంక్రాంతి బరిలో విశ్వంభర?
RS Praveen Kumar | పాలమూరు ప్రజలారా.. రేవంత్ రెడ్డి మోసాలకు మరోసారి బలికావద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
Meenakshi Chaudhary | చీరకట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మీనాక్షి.. అదిరిపోయే ఫొటోలు!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

