వేగం పెంచాల్సిందే!
అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే.
అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో బన్నీ ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ను త్వరలో అందించబోతున్నామని ఇటీవలే మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్ లైనప్‌లో మలయాళీ దర్శకుడు బాసిల్ జోసెఫ్ సినిమా కూడా ఉంది.
తాజా సమచారం ప్రకారం ఈ రెండు చిత్రాల్ని వేగంగా పూర్తి చేయాలని బన్నీ నిర్ణయించుకున్నారట. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాల కోసం దాదాపు ఐదేళ్ల సమయాన్ని వెచ్చించారు అల్లు అర్జున్. తాజా చిత్రం ‘రాకా’ కూడా కథాపరిధి దృష్ట్యా ఎక్కువ సమయాన్నే తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రాల్ని వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో బన్నీ ఉన్నారని అంటున్నారు. లోకేష్ కనకరాజ్ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లే అవకాశముంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

