ఆస్కార్ రేసులో రామాయణ ముందడుగు
భారతీయ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ‘రామాయణ’ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల బరిలో ముందడుగు వేసింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పోటీపడుతున్న సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.
భారతీయ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న ‘రామాయణ’ చిత్రం ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాల బరిలో ముందడుగు వేసింది. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పోటీపడుతున్న సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇందులో అవెంజర్స్: డూమ్స్ డే, డ్యూన్ పార్ట్-3, ది ఒడిస్సీ, స్పైడర్‌మ్యాన్: బ్రాండ్ న్యూడే, ప్రాజెక్ట్ హేల్ మేరీ వంటి హాలీవుడ్ చిత్రాలు ఉండటం విశేషం. విజువల్ ఎఫెక్ట్స్ విభాగానికి సంబంధించి ఉత్తమ 20 చిత్రాల జాబితాలో ‘రామాయణ’ చోటు సంపాదించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన విజువల్ ఎఫెక్ట్స్ బృందాలు పనిచేస్తున్న చిత్రాలతో ‘రామాయణ’ పోటీలో నిలవడం భారతీయ సినిమా తాలూకు సాంకేతిక ప్రతిభకు దక్కిన గుర్తింపుగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబర్ 15న పది చిత్రాలతో అధికారిక షార్ట్‌లిస్ట్‌ను ప్రకటించనున్నారు. 99వ ఆస్కార్ అవార్డుల వేడుక మార్చి 14న జరగనుంది. ఇప్పటికే ఉత్తమ అంతర్జాతీయ చిత్రాల విభాగంలో గోంథల్, అంఘ్ వంటి భారతీయ చిత్రాలు ఆస్కార్ బరిలో అర్హత సాధించాయి. రణ్‌బీర్‌కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారి దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మించిన ‘రామాయణ’ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1700కోట్ల పైచిలుకు వసూళ్లతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

