Sri Reddy | సంసారంలో సరిగమలు సహజం..సమంతకు శ్రీరెడ్డి సూచన..వీడియో వైరల్
టాలీవుడ్ (Tollywood) స్టార్ కపుల్ సమంత (Samantha) నాగచైతన్య (Naga Chaitanya) గురించి సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. నటి శ్రీరెడ్డి (Sri Reddy) సామ్-చైతూ వ్యవహారంపై తన స్పందనను తెలియజేస్తూ వీడియో సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసింది.

టాలీవుడ్ (Tollywood) స్టార్ కపుల్ సమంత (Samantha) నాగచైతన్య (Naga Chaitanya) గురించి సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ న్యూస్ పై నాగచైతన్యకానీ, సమంత కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అయితే తనకు హైదరాబాదే ఇళ్లని, హైదరాబాద్ తనకు అన్నీ ఇచ్చిందని సమంత చెప్పడంతో..ఇప్పటివరకు వచ్చివన్నీ పుకార్లేని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా టాలీవుడ్ నటి శ్రీరెడ్డి (Sri Reddy) సామ్-చైతూ వ్యవహారంపై తన స్పందనను తెలియజేస్తూ వీడియో సందేశాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసింది.
మీరిద్దరూ కలిసుండాలని మేమంతా కోరుకుంటున్నాం. మీ ఇద్దరినీ మేమంతా ఆశీర్వదిస్తున్నాం. మీరు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగించే భార్యాభర్తల్లా ఉండాలనుకుంటున్నాం. మిమ్మల్ని చూసి చాలా మంది స్పూర్తి పొందుతారు. ఏమైనా ఉండి ఉండొచ్చు. కానీ సర్దుబాటు అనేది ఉండాలని కోరుకుంటున్నాను. ఇది నా విజ్ఞప్తి మాత్రమే. భార్యాభర్తలన్న తర్వాత సంసారంలో సరిగమలుంటూనే ఉంటాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈగో, ఆటిట్యూడ్స్, ఇది అది తేడా లేకుండా చాలా అపార్థాలుంటాయి. ఒక అమ్మాయికి ఎక్కువ ఓపిక ఉండాలని మన భారతదేశం మనకు నేర్పించింది.
తను (సమంత)మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిగా నేను కోరుకుంటున్నా. కొన్ని విషయాలు మార్చుకుంటే తన సంసారం కానీ, తను కానీ బాగుంటుందనేది నా ఉద్దేశం. నాకు అనవసరంగా పిచ్చి కామెంట్లు పెట్టకండ్రా..అయ్యా.వారిద్దరి సంసారం బాగుండాలని కోరుకుంటున్నా. నన్ను కూడా ఆశీర్వదించండి తొందరగా పెళ్లయిపోవాలని. అయ్యయ్యో వద్దురా అని ఈ కొట్టుకోవడాలు నా వల్ల కాదరయ్యో అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

