గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సమంత-నాగ చైతన్య విడాకుల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరి విడాకులకు సంబంధించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఇటు సమంత కాని అటు నాగ చైతన్య కాని స్పందించకపోవడంతో రోజు రోజుకి కొత్త వార్తలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా సమంత విడాకుల వెనుక కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత చాలా బోల్డ్‌గా నటించడంతోనే అసలు వివాదం మొదలైందని తెలుస్తుండగా, చైతూ-సామ్‌ని చాలా సార్లు ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించిన ఎలాంటి ఫలితం లేదని సమాచారం. చై- సామ్ డివోర్స్ ప్రాసెస్ మరో రెండు మూడు నెలల్లో పూర్తి కానుందని, స్థిర, చర ఆస్తులతో కలిపి సమంతకు భరణంగా 50 కోట్లు ఇవ్వనున్నారని కొందరు చెబుతుంటే మరి కొందరు 250 నుండి 300 కోట్ల వరకు అక్కినేని ఫ్యామిలీ ఇవ్వనుందని అంటున్నారు. మరి ఇందులోఎంత నిజముందనేది తెలియాలంటే చైతూ- సామ్లలో ఒకరు స్పందించిక తప్పదు.