Samantha | హ్యాపీ మూడ్లో సమంత..ఈ స్పెషల్ వీడియో చూడండి
టాలీవుడ్ (Tollywood) భామ సమంతకు (Samantha) ఈ వారం చాలా ప్రత్యేకమైంది. సినిమాలతో అందరికీ వినోదాన్ని అందిస్తూ వస్తున్న సామ్ గతేడాది ఇదే సమయంలో వస్త్ర ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది.

టాలీవుడ్ (Tollywood) భామ సమంతకు (Samantha) ఈ వారం చాలా ప్రత్యేకమైంది. సినిమాలతో అందరికీ వినోదాన్ని అందిస్తూ వస్తున్న సామ్ గతేడాది ఇదే సమయంలో వస్త్ర ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టింది. సాకి (Saaki) పేరుతో క్లాతింగ్ బ్రాండ్ ను మొదలుపెట్టింది సమంత. ఈ భామ తన వెంచర్ మొదలుపెట్టి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని అందరితో పంచుకుంది. తెలుపు రంగు కేక్ చేతిలో పట్టుకొని ఆనందంలో ఎగిరి గంతేస్తున్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
మొత్తానికి మేము ఏడాది పూర్తి చేశాం. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని నా బృందం, నా అందమైన కుటుంబమైన మీతో వేడుకగా చేసుకోవాలనుకుంటున్నా. మీ అందరితో వేడుక జరిపేందుకు వారమంతా ఎక్జయిటింగ్ ఈవెంట్స్ తో ప్రణాళిక సిద్దమైంది..అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. తమ మనసును, ఆత్మను ఇక్కడ పెట్టి పెద్ద విజయాన్ని సాధించేందుకు కృషి చేసిన ‘సాకి’ ప్రతిభావంతులైన బృందానికి కేరింతలతో అభినందనలు తెలియజేస్తున్నా. మేమంతా మరో ఆహ్లాదకరమైన, ఉత్తేజకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాం. గత ఏడాది కాలంగా మీరు మా పట్ల చూపిస్తున్న ఆదరణ, ప్రేమ కొనసాగిస్తారని ఆశిస్తున్నానని పేర్కొంది.
సమంత మొదలుపెట్టిన ‘సాకి’ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండస్ట్రీ స్నేహితులు సామ్ కు శుభాంకాంక్షలు తెలియజేశారు. సమంత పోస్టును షేర్ చేస్తూ టాలీవుడ్ హీరోయిన్లు ప్రగ్యాజైశ్వాల్, తమన్నా, సంయుక్తా హెగ్డే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

