KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కొండపొలం ( Konda Polam). క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇవాళ కొండపొలం ట్రైలర్ ను విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కొండపొలం ( Konda Polam). క్రిష్(Krish Jagarlamudi) దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ రానే వచ్చింది. మేకర్స్ ఇవాళ కొండపొలం ట్రైలర్ ను విడుదల చేశారు. ‘గొర్ల కాపరుల కుటుంబం..తల్లిదండ్రులకు చదువు లేదు..ఏ కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నారు..అని ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లిన వైష్ణవ్ తేజ్ ను బోర్డు మెంబర్ నాజర్ అడుగగా..నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా‘ సార్ అంటూ చెప్పే వైష్ణవ్ తేజ్ చెప్పే సంభాషణలతో ట్రైలర్ మొదలైంది.
నల్లమల అటవీ ప్రాంతంలో గొర్ల కాపారుల కుటుంబాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే కథాంశంతో క్యూరియాసిటీని కలుగజేస్తూ విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. వైష్ణవ్ తేజ్ గొర్ల కాపరిగా, ఉద్యోగం కోసం ప్రయత్నించే వ్యక్తిగా రెండు షేడ్స్ లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ గొర్ల కాపరి కూతురి పాత్రలో డీ గ్లామరైజ్ డ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. కొందరు ముష్కరుల నుంచి గొర్రెలు, వన్యప్రాణులను వైష్ణవ్ తేజ్ ఎలా కాపాడనేది సస్పెన్స్ గా ఉంది.
ఎంఎం కీరవాణి అందించిన బీజీఎం ఆకట్టుకుంటోంది. సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

