Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
టాలీవుడ్ (TOLLYWOOD) యాక్టర్ రవితేజ (Ravi Teja) నటించిన విక్రమార్కుడు (Vikramarkudu) సినిమా ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాజమౌళి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ ను ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడని అంతా తెగ ఆలోచిస్తున్నారు.

టాలీవుడ్ (TOLLYWOOD) యాక్టర్ రవితేజ (Ravi Teja) నటించిన విక్రమార్కుడు (Vikramarkudu) సినిమా ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ రాబోతుందని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ (Vijayendra Prasad) ప్రస్తుతం స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నట్టు టాక్. కాగా మరి రాజమౌళి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రానికి సీక్వెల్ ను ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడని అంతా తెగ ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం ఆ డైరెక్టర్ ఇతడే అంటూ ఓ వార్త ఫిలింనగర్ లో రౌండప్ చేస్తోంది. ఇటీవలే సీటీమార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు సంపత్ నంది (Sampath Nandi). వినోదానికి పెద్ద పీట వేస్తూనే కమర్షియల్ సినిమాలు తెరకెక్కిస్తుంటాడు సంపత్ నంది. విక్రమార్కుడు సీక్వెల్ బాధ్యతలను సంపత్ నంది తీసుకోబోతున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రవితేజ-సంపత్ నంది కాంబినేషన్ లో ఇప్పటికే బెంగాల్ టైగర్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ తన మార్కు నటనతో వినోదాన్ని పంచాడు. మరి అంతా అనుకున్నట్టుగా కుదిరితే త్వరలోనే సంపత్ నంది-రవితేజ కలయికలో రెండో సినిమా రావడం ఖాయమైనట్టే.

విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడెవరనే దానిపై అధికారిక ప్రకటన వస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. క్రాక్ సినిమా బాక్సాపీస్ వద్ద ఘన విజయం సాధించడంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. ప్రస్తుతం ఖిలాడి చిత్రం సెట్స్ పై ఉంది. మరోవైపు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

