Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాప్రకాశ్ వారియ (Priya Prakash Varrier). ఒరు ఆడార్ లవ్ (Oru Adaar Love) సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.

కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier). ఒరు ఆడార్ లవ్ (Oru Adaar Love) సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయిన ఈ భామకు ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగానే పెరిగిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియా వారియర్ కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రణ్ బీర్ కపూర్ నటించిన యే దిల్ హై ముష్కిల్ నుంచి చెన్న మెరేయా (Channa Mereya) పాట ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ పార్టీకి హాజరైన ప్రియా వారియర్ చెన్న మెరేయా పాట పాడిన త్రోబ్యాక్ వీడియో ఇపుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది.
చెర్రీ పండు రంగు చీరలో అందాలు ఆరబోసింది. ఈవెంట్ సందర్భంగా పాటలు పాడే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రియా వారియర్ యే దిల్ హై ముష్కిల్ నుంచి తనకిష్టమైన చెన్న మెరేయా పాటను పాడుతుండగా..మిగిలిన వారంతా కోరస్ అందించారు. పార్టీ మూడ్లో ప్రియా వారియర్ పాడిన హిందీ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈవెంట్ లో స్లీవ్ లెస్ టాప్, సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మలయాళ భామ.
ఈ ఏడాది చెక్, ఇష్క్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది ప్రియా వారియర్. హిందీలో శ్రీదేవి బంగ్లా, కన్నడలో విష్ణుప్రియ చిత్రాల్లో నటిస్తోంది ప్రియావారియర్. ఈ సుందరికి ఇన్ స్టాగ్రామ్లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లున్నారు.
ఇవి కూడా చదవండి..
Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

