Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!

నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘లవ్‌స్టోరీ’. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వినాయక చవితికి విడుదల కావలసిన ఈ చిత్రం పలు కారణాల వలన వాయిదా పడింది. సెప్టెంబర్ 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది.
ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదల చేసిన ‘లవ్‌స్టోరీ’ టీజర్, ‘సారంగ దరియా’ పాట యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సారంగదరియా పాట అయితే అంచనాలను రెట్టింపు చేసింది. ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సున్నితమైన ప్రేమ కథతో శేఖర్ కమ్ముల మరోసారి హృదయాన్ని తాకేలా సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.
సినిమాలో డైలాగ్స్, ఎమోషన్స్, చైతూ-సాయి పల్లవి డ్యాన్స్ అదిరిపోనున్నాయని తాజాగా విడుదలైన ట్రైలర్‌ని చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాలో రావు రమేశ్ .. దేవయాని .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మించాయి. నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

