Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
టాలీవుడ్ హీరో నాని (Nani) నటించిన జెర్సీ (Jersey ) చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) బాలీవుడ్ (Bollywood) నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) ప్రధాన పాత్రలో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ హీరో నాని (Nani) నటించిన జెర్సీ (Jersey ) బాక్సాపీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించడమే కాదు అవార్డుల పంట కూడా పండించింది. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) డైరెక్ట్ చేసిన ఈ సూపర్ హిట్ చిత్రాన్ని బాలీవుడ్ (Bollywood) నటుడు షాహిద్ కపూర్ (Shahid Kapoor) ప్రధాన పాత్రలో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై నాని స్పందన ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జెర్సీ హిందీ వెర్షన్ పై నాని మాట్లాడుతూ..గౌతమ్ తిన్ననూరి పని చేసే తీరు చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది.
గౌతమ్ చాలా తక్కువ మాట్లాడుతాడు. అతని మనస్సులోని భావాలను చెప్పగలను. ఒకవేళ అతడు ఏదైనా ఇష్టపడితే..అది అతడి ముఖంలో కనిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి ఇంట్రావర్ట్. హిందీ వెర్షన్ వస్తున్న తీరుతో తాను సంతోషంగా ఉన్నానని గౌతమ్ తిన్ననూరి చెప్పాడు. సినిమా ఎంత అద్బుతంగా వచ్చిందో ఖచ్చితంగా నేను ఊహించగలను. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా. షాహిద్ కపూర్ గొప్ప నటుడు.
ఒరిజినల్ వెర్షన్ కంటే ఉత్తమంగా షాహిద్ కపూర్ నటిస్తాడు. పాత్రలో లీనమై పోవడం పక్కా. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డాయి. తాను థియేటర్ అనుభవాన్ని చాలా మిస్సవుతున్నానని చెప్పాడు. నేను థియేటర్లలో సినిమాలు చూసుకుంటూ పెరిగాను. థియేటర్ కు వెళ్లలేని లోటు అలాగే ఉండిపోయింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉత్తమ మార్గం అని చెప్పుకొచ్చాడు నాని.
ఇవి కూడా చదవండి..
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- Jersey
- Nani
- Shahidkapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

