Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్
హీరోయిన్లలో చాలా మందికి ఏదో ఒక క్రికెటర్ పై క్రష్ ఉంటుంది. క్రికెటర్లతో ప్రేమలో పడ్డ వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. నేను కూడా ఓ క్రికెట్‌తో ప్రేమలో పడ్డానని చెప్తోంది బాలీవుడ్ (Bollywood) నటి మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur).

క్రికెటర్లంటే ఏ అమ్మాయికి ఇష్టముండదు చెప్పండి. హీరోయిన్లలో చాలా మందికి ఏదో ఒక క్రికెటర్ పై క్రష్ ఉంటుంది. క్రికెటర్లతో ప్రేమలో పడ్డ వాళ్లు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ప్రేమలో పడి క్రికెటర్ ను పెళ్లి చేసుకున్న వాళ్లు కొంతమందే ఉన్నారు. నేను కూడా ఓ క్రికెట్‌తో ప్రేమలో పడ్డానని చెప్తోంది బాలీవుడ్ (Bollywood) నటి మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur). సూపర్ 30, బట్లా హౌజ్, ఘోస్ట్ స్టోరీస్ తోపాటు పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది మృణాళ్ ఠాకూర్.
తాను ఒకప్పుడు విరాట్ కోహ్లీ (Virat Kohli ) తో పిచ్చిగా ప్రేమలో పడ్డానని చెప్పింది. ప్రస్తుతం క్రికెట్ నేపథ్యంలో హిందీలో రీమేక్ అవుతున్న జెర్సీ (Jersey) లో నటిస్తోంది మృణాళ్. షాహిద్ కపూర్ తో రొమాన్స్ చేయబోతుంది. ఈ సందర్భంగా చేసిన చిట్ చాట్ లో మాట్లాడుతూ..నా సోదరుడి వల్లే నేను క్రికెట్ ఇష్టపడటం మొదలుపెట్టా. ఆ ఓ టైంలో విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడిపోయా.
ఐదేళ్ల క్రితం ఓ స్టేడియం లో మ్యాచ్ లైవ్ జరుగుతుంటే విరాట్ కోహ్లీ పక్కన కూర్చొని వీక్షించాను. అప్పుడు నీలి రంగు జెర్సీ వేసుకుని భారత టీం తరుపు చీర్స్ చేశారు. కట్ చేస్తే..ఇవాళ క్రికెట్ మీద వస్తున్న జెర్సీ సినిమాలో నటిస్తున్నా. ఇలాంటి చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న జెర్సీ నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి..
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

