Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్

ఆపద ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు సోనూసూద్. చేతికి ఎముకలేనట్టు వరుస సాయాలు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ తాజాగా మరో ప్రాణాన్ని నిలబెట్టారు. ఓ బాలుడికి కాలేయ మార్పిడి, గుండె శస్త్ర చికిత్స చేయించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు.. ధన్యవాదాలు సోనూసూద్. మీ మద్దతు వలన శుభమ్ కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు శుభమ్ హైదరాబాద్ అపోలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మీ సహాయానికి ధన్యవాదాలు!” అంటూ ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన సోనూసూద్.. బిగ్ డే.. ఈ మధ్య కాలంలో చాలా క్లిష్టమైన కాలేయ మార్పిడి, గుండె శస్త్రచికిత్స ఒకటి సూపర్ సక్సెస్. సర్వశక్తిమంతుడికి ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశారు. కరోనా కాలం నుండి వరుస సాయాలు చేసుకుంటూ వెళుతున్న సోనూసూద్ రియల్ హీరోగా, దేవుడిగా కీర్తించబడుతున్నాడు. ఎప్పటి కప్పుడు దేశంలో నెలకొంటున్న పరిస్థితులను గమనిస్తున్న సోనూ వెంటనే సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆయనకి కొందరు గుడులు కట్టి పూజిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

