Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
సల్మాన్‌ఖాన్ (Salman Khan), కత్రినాకైఫ్ (Katrina Kaif) సిల్వర్ స్క్రీన్ పై ఈ బాలీవుడ్ (Bollywood) జోడీ కనిపించిందంటే చాలు హిట్టు పడినట్టే. సెంట్రల్ టర్కీలోని కాప్పడోసియాలో సల్మాన్, కత్రినాపై రొమాంటిక్ ట్రాక్ ను షూట్ చేస్తున్నారు.

సల్మాన్‌ఖాన్ (Salman Khan), కత్రినాకైఫ్ (Katrina Kaif) సిల్వర్ స్క్రీన్ పై ఈ బాలీవుడ్ (Bollywood) జోడీ కనిపించిందంటే చాలు హిట్టు పడినట్టే. ఏక్తా టైగర్, టైగర్ జిందా హై చిత్రాలతో అద్బుతమైన కెమిస్ట్రీతో అదరగొట్టిన సల్లూ, కత్రినా ఈ సారి టైగర్ 3 (Tiger 3)తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టర్కీ (central Turkey) లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. టైగర్ జిందా హైలో స్వాగ్ సే కరెంగే సబ్ కా స్వాగత్ (Swag Se Karenge Sabka Swagat ) పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
గ్రీస్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటకు చాలా బడ్జెట్ పెట్టారు మేకర్స్. ఇపుడు ఈ సాంగ్ ను తలదన్నే రొమాంటిక్ ట్రాక్ ను టైగర్ 3లో పెట్టారు. సెంట్రల్ టర్కీలోని కాప్పడోసియాలో సల్మాన్, కత్రినాపై ఈ ట్రాక్ ను షూట్ చేస్తున్నారు. టైగర్ 3 చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు నిర్మాత ఆదిత్య చోప్రా. ప్రీతమ్ కంపోజ్ చేసిన ఈ పాటను వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ చాలా ఖరీదైన పాటగా నిలువనుంది. తాజా సమాచారం ప్రకారం ఒక్క సాంగ్ కే రూ.3 కోట్లు ఖర్చుపెడుతున్నారంటే…ఆదిత్య చోప్రా ఎంత రిచ్ గా పాటను చూపించబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుత సీజన్ చల్లటి వాతావరణంలో షూటింగ్ కు అనుకూలంగా ఉండటంతో..రోజు వ్యాలీ, లవ్ వ్యాలీ, స్వర్డ్ వ్యాలీ, పసబాగ్ వ్యాలీ లాంటి సుందర ప్రదేశాల్లో పాటను చిత్రీకరిస్తున్నారు. తాజా సాంగ్ సినిమా క్లైమాక్స్ టైంలో ఉంటుందని బీటౌన్ టాక్. కథానుగుణంగా విలన్ ను పట్టుకునే ప్రయత్నంలో సల్మాన్, జోయా (కత్రినా) ఒక దేశం నుంచి మరోదేశానికి వెళ్తారట. డైరెక్టర్ మనీశ్ శర్మ అండ్ టీం ఇటీవలే రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో సల్మాన్, కత్రినా, ఇతర తారాగణంపై వచ్చే హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇవి కూడా చదవండి..
Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని
Sanjay Dutt: సౌత్‌లోను బిజీ అవుతున్న సంజయ్ దత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

