Nivetha: ఆవు పాలు పితికి, కాఫీ చేసుకున్న వకీల్ సాబ్ భామ

సాధారణంగా సెలబ్రిటీలు అంటే చాలా హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలికి మట్టి అంటకుండా రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుంటారు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతుంటారంటే వారి నీట్నెస్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే వకీల్ సాబ్ చిత్రంలో నటించి అలరించిన నివేదా ఆవుల పాకలోకి వెళ్లి స్వయంగా పాలు పితికింది.
బ్లాక్ కలర్ జాకెట్ ధరించి డైరీ ఫామ్‌కి వెళ్లిన నివేదా ఆవు పాలు పితికి వాటితో కాఫీ పెట్టుకుంది. దీనికి సంబంధించి ఓ వీడియో రెడీ చేసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్స్ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సాధారణంగా సామాన్యులకి కూడా పాలు పితకాలంటే భయం.అలాంటింది నివేదా ధైర్యంగా పాలు పితకడాన్ని ప్రశంసిస్తున్నారు.
నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. గతంలో వచ్చిన బ్రోచేవారెవరురా, జెంటిల్ మెన్, జైలవకుశ, 118 లాంటి సినిమాలు హిట్స్ గా నిలిచాయి. అలాగే మలయాళం, తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Cow
- nivetha
- nivetha thomas
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

