Drugs Case: ఈడీ ఆఫీసుకి చేరుకున్న రానా..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. కేసులో కీలక నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపగా, ఈ క్రమంలో ఒక్కొక్కరిని విచారిస్తుంది. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులని విచారించారు. నిన్న నందును పలు విధాల విచారించారు ఈడీ అధికారులు. ప్రధానంగా మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఎఫ్ క్లబ్తో ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు.
విచారణలో భాగంగా రానా కొద్ది సేపటి క్రితం ఈడీ ఆఫీసుకి చేరుకున్నారు. 2017 విచారణ జాబితాలో రానా పేరు లేదు. కానీ.. నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్కు రానా తరచూ వెళ్లేవారని, ఈడీ అధికారులు సమాచారం రాబట్టారు. అనేక ట్రాన్సాక్షన్స్ కూడా చేసినట్టు ఆధారాలు లభించడంతో ఈడీ ..రానాకి కూడా నోటీసులు పంపింది.ఈ నేపథ్యంలో హైద్రాబాద్లోని ఓ హోటల్ నుండి తన ఆడిటర్లతో కలిసి రానా ఈడీ కార్యాలయానికి చేరుకొన్నారు.
రానా ఖాతాలతో పాటు రానా కుటుంబానికి చెందిన ప్రొడక్షన్ సంస్థ నుండి డ్రగ్స్ సరఫరా కోసం నిధులు బదిలీ చేశారా అనే విషయమై ఈడీ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. నవదీప్, రానా మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలపై కూడ ఈడీ దర్యాప్తు చేయనుంది. రేపు హీరో రవితేజతో పాటు.. ఆయన డ్రైవర్ శ్రీనివాస్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drugs Case
- Rana
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

