బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో షారుక్ ఖాన్ (ShahRukh Khan) నటించిన జీరో చిత్రం బాక్సాపీస్ వద్ద డీలా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత పఠాన్ సినిమాతో విజయాన్ని అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు షారుక్. మూడేళ్ల తర్వాత తమ ఫేవరెట్ హీరో తెరపై ఎప్పుడు కనిపిస్తాడా..? అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. కాగా ఈ స్టార్ తన అభిమానులకు వినోదాన్ని అందించేందుకు డిజిటల్ ప్లాట్ ఫాం (OTT debut)లో కూడా మెరిసేందుకు రెడీ అయ్యాడన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే తమిళ దర్శకుడు ఆట్లీతో సంకి సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం షారుక్ ఖాన్ వెబ్ సిరీస్ కు పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం డిస్నీ + హాట్ స్టార్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనుంది. తన కోస్టార్లు అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ సినిమాలతో వినోదాన్ని అందిస్తుంటే..తాను మాత్రం ఆ అవకాశం మిస్సవుతున్నానని బాధపడుతున్నట్టు ఓ ప్రకటన ద్వారా చెప్పాడు షారుక్.
ఈ యాడ్ ద్వారా తాను ఓటీటీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకొస్తున్నానని చెప్పకనే చెప్పాడు షారుక్ ఖాన్. మొత్తానికి ఈ బాలీవుడ్ బాద్ షా ఇక తన అభిమానుల కోసం మళ్లీ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు అర్థమవుతోంది.
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Mrunal Thakur | విరాట్ కోహ్లీతో పిచ్చిగా ప్రేమలో పడ్డా: మృణాళ్ ఠాకూర్