Sampath Nandi| సీటీమార్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..?
టాలీవుడ్ (TOLLYWOOD) డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) సీటీమార్ సినిమాతో మళ్లీ ట్రాక్ పైకి వచ్చాడు. ఇంతకీ విషయమేంటంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సంపత్ నంది సినిమా చేయబోతుండటం.

టాలీవుడ్ (TOLLYWOOD) డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) సీటీమార్ సినిమాతో మళ్లీ ట్రాక్ పైకి వచ్చాడు. ఈ యువ దర్శకుడికి సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయమేంటంటే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తో సంపత్ నంది సినిమా చేయబోతుండటం. అవును ఈ క్రేజీ గాసిప్ ఇపుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. రచ్చ సినిమా నుండే సంపత్ నంది తో సినిమా చేయాలని చిరు ఆసక్తి కనబరిచాడని ఇప్పటివరకున్న టాక్.
కాగా ఇపుడు సీటీమార్ సక్సెస్ తర్వాత సంపత్ కు చిరు సినిమా చేస్తానని చెప్పడం, దీంతో సంపత్ కూడా స్టోరీ లైన్ పై పనిచేస్తుండటం వెంట వెంటనే జరిగిపోతున్నాయన్న వార్త ఇపుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడని టాక్. కొంతకాలంగా చిరంజీవి రీమేక్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు. అయితే సంపత్ నంది విషయంలో మాత్రం స్క్రిప్ట్ వర్క్ ఆధారంగా సినిమాపై చిరంజీవి ఓ అంచనాకు రానున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ చిరును కథ ఇంప్రెస్ చేసినట్టైతే సంపత్ నంది జాక్ పాట్ కొట్టేసినట్టేనని అంతా అనుకుంటున్నారు.
గౌతమ్ నందా సినిమా వచ్చిన 4 ఏండ్ల తర్వాత సరైన విజయాన్ని అందుకున్నాడు సంపత్ నంది. మరి ఈ యువ దర్శకుడు మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అద్బుతమైన అవకాశాన్ని కొట్టేస్తాడా..? లేదా..? అన్నది కొంత కాలం ఆగితే తెలుస్తుంది. ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు చిరు. దీంతోపాటు మెహర్ రమేశ్ డైరెక్షన్ లో వేదాళమ్ రీమేక్, బాబీతో మరో సినిమా చేస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
Sai Dharam Tej: ఆపరేషన్ సక్సెస్.. 24 గంటలు అబ్జర్వేషన్లో…!
Love Story: ప్రమోషన్ స్పీడ్ పెంచిన లవ్ స్టోరీ మేకర్స్..ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..!
Shah Rukh Khan | స్టార్ హీరో ఓటీటీ ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

