Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కి ఓ ఆరోగ్య సమస్య ఉన్నా ఇప్పటివరకు బయటకు చెప్పకుండా మెయింటైన్ చేస్తూ..అభిమానులకు వినోదాన్ని పంచుతూ వస్తోంది.

చాలా మంది నటీమణులు ఈ మధ్య కాలంలో తమ ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే ఇప్పటికే తమకున్న సమస్యలను పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) కి ఓ ఆరోగ్య సమస్య ఉన్నా ఇప్పటివరకు బయటకు చెప్పకుండా మెయింటైన్ చేస్తూ..అభిమానులకు వినోదాన్ని పంచుతూ వస్తోంది.
ఇటీవలే ఓ సందర్భంలో ఈ విషయమేంటో పరోక్షంగా చెప్పింది. నాకు మంచి ఆహారపు అలవాట్లున్నాయి. కానీ ఎక్కువగా వర్కవుట్స్ చేయడం, ఎక్కువ మొత్తంలో ఒత్తిడిని అధిగమించే క్రమంలో నాకు ఓ ఆరోగ్య సమస్య ఏర్పడింది. కానీ బయటకు చెప్పలేదు. ప్రస్తుతం నేను సేంద్రీయ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నాను. సమస్య నుంచి బయట పడేందుకు సంబంధిత నిపుణుల సూచన మేరకు వ్యాయామాలు చేస్తున్నా. అంతేకాదు ఫ్రై చేసిన (fried food)
ఆహారానికి పూర్తిగా గుడ్ బై చెప్పినట్టు పేర్కొంది.
తమన్నా తరచుగా నోని లేదా తొగరి ఫలం (Noni juice) నుంచి తయారు చేసిన జ్యూస్ సేవిస్తుంది. ఆ జ్యూస్ తనకు ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెప్పింది తమన్నా. అంతేకాదు రెగ్యులర్ ఆహార పదార్థాల్లో ఆమ్లా జ్యూస్, పసుపు, కీర జ్యూస్, బాదంపాలు, కొబ్బరి నీళ్లు ఉండేలా చూసుకుంటున్నానని చెప్పింది. ఫిట్‌గా, స్లిమ్ గా ఉండేందుకు ద్రవపదార్థాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. తన కెరీర్ మొదటి నుంచి సరైన డైటీషియన్ (dietician) ను నియమించుకోకపోవడం తాను చేసిన పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది తమన్నా. మొత్తానికి ఆ సమస్య ఏంటో చెప్పకున్నా..దాని నుంచి బయటపడే పనిలో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది.
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

