Viral Video | దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
బాలీవుడ్లో నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా మంచి పేరు సంపాదించాడు యువ నటుడు కార్తీక్ ఆర్యన్. అతనికి సంబంధించిన తాజా వీడియో ఒకటి వైరల్( Viral Video )గా మారింది.

ముంబై: బాలీవుడ్లో నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా మంచి పేరు సంపాదించాడు యువ నటుడు కార్తీక్ ఆర్యన్. అతనికి సంబంధించిన తాజా వీడియో ఒకటి వైరల్( Viral Video )గా మారింది. తన లేటెస్ట్ మూవీ ఫ్రెడ్డీ కోసం మహారాష్ట్రలోని మహాబళేశ్వర్ సమీపంలో ఉండే పంచ్ఘనీలో షూటింగ్ చేస్తున్నాడు ఆర్యన్. ఈ క్రమంలో అలా సరదాగా అక్కడి ప్రకృతిని ఎంజాయ్ చేయడానికి కారులో బయటకు వెళ్లిన అతడు.. తిరిగి వెళ్లే సమయంలో దారి తప్పాడు. దారి కోసం వెతుకుతున్న అతన్ని అక్కడే ఉన్న పోలీసులు గుర్తు పట్టారు. అతనికి దారి చూపిస్తూ.. పనిలో పనిగా సెల్ఫీలో దిగడానికి పోటీలు పడ్డారు. కార్తీక్ ఆర్యన్‌ను చూసిన ఓ పోలీస్ వెంటనే మొబైల్ ఫోన్ తీసి సెల్ఫీకి రెడీ అయిపోయాడు. అంతేకాదు సన్‌గ్లాసెస్ తీయమని కూడా అతడు కార్తీక్‌ను అడగడం విశేషం. సెల్ఫీలు దిగడం పూర్తయిన తర్వాత అతనికి దారి చూపించి పంపించారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కొందరు పోలీసుల తీరుపై మండిపడ్డారు. డ్యూటీ మధ్యలో ఇలా సెల్ఫీలు దిగడమేంటని ప్రశ్నించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

