TCA : భారత క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మ, సినీ హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ సంఘం(TCA ) నోటీసులు పంపింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించ తలపెట్టిన తెలంగాణ టీ20 లీగ్(టీజీ20)కు ప్రచారం కల్పిస్తున్నారనే ఆరోపణలతో వీరికి లీగల్ నోటీసులు జారీ చేసింది. క్రికెటర్లతో పాటు పలువురు సినీ తారలకు నోటీసులు పంపామని టీసీఏ జనరల్ సెక్రటరీ గురవా రెడ్డి వెల్లడించాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి అనుమతి లేని టీజీ20కి ప్రచారం చేయడం అక్రమమని పేర్కొన్న టీసీఏ చర్యలకు ఉపక్రమించింది. టీసీఏ నుంచి నోటీసులు అందుకున్న వారిలో క్రికెటర్లు సిరాజ్, తిలక్‌తో పాటు మాజీ ఆటగాడు అంబటి రాయుడు, టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్ దగ్గుబాటిలు ఉన్నారు.
Telangana Cricket Association (TCA) issues legal notices to film actors Vijay Deverakonda and Venkatesh, as well as cricketers Tilak Varma, Ambati Rayudu, and Mohd Siraj.
The notice states that the Hyderabad Cricket Association (HCA) is conducting business with corporate…
— ANI (@ANI) June 17, 2026
‘క్రికెటర్లు సిరాజ్, తిలక్ వర్మ, అబటి రాయుడు.. సినిమా హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేశ్‌లకు ఈ రోజు తెలంగాణ క్రికెట్ సంఘం ఈ రోజు నోటీసులు పంపింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించ తలపెట్టిన తెలంగాణ టీ20 లీగ్(టీజీ20)కు ప్రచారం కల్పిస్తున్నారని వీరికి నోటీసులు పంపాం’ అని టీసీఏ జనరల్ సెక్రటరీ గురవా రెడ్డి తెలిపాడు.