FIFA World Cup : ఫిఫా వరల్డ్‌కప్‌లో ఐదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్‌కు బిగ్ షాక్. గ్రుప్ సీలో హైతీ(Haiti)తో జరగాల్సిన మ్యాచ్‌కు ఆ జట్టు స్టార్ ఆటగాడు నెయ్మర్(Neymar) దూరయ్యాడు. గాయంతో బాధ పడుతున్న ఈ ఫార్వర్డ్ ఆటగాడు ఇంకా కోలుకోకపోవడమే అందుకు కారణం. రైటర్స్ మీడియా కథనం ప్రకారం నెయ్మర్ ఆడడం లేదని బ్రెజిల్ ఫుట్‌బాల్ కాన్ఫిడెరేషన్(CBF) పేర్కొంది.
‘ప్రస్తుతం గాయం నుంచి కోలుకునే దశలో ఉన్న నెయ్మర్ న్యూ జెర్సీలోనే ఉండనున్నాడు. కొలంబియా పార్క్ శిక్షణ కేంద్రంలోని రిడ్జ్ హోటల్లో అతడికి అత్యున్నత సౌకర్యాలను అతడు ఉపయోగించుకోనున్నాడు’ అని సీబీఎఫ్ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. నెయ్మర్ విషయంలో బ్రెజిల్ ఆచితూచి వ్యహరిస్తోంది. తర్వాతి బిగ్ మ్యాచ్‌లకు అతడు ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో వెంటనే ఆడించడం లేదని సమాచారం. హైతీ, బ్రెజిల్ మ్యాచ్ జూన్ 19న ఉదయం 6:00 గంటలకు మొదలవ్వనుంది.