Nida Dar : పాకిస్థాన్ మాజీ కెప్టెన్ నిడా దార్(Nida Dar) త్వరలోనే పునరాగమనం చేయనుంది. మానసిక ఆరోగ్యం బాగా లేనందున ఏడాది విరామం తీసుకున్న నిడా మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడనుంది. ఒకప్పుడు సారథిగా మెప్పించిన ఆమె ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నానని.. మరోసారి పాక్ జెర్సీతో ఆడాలని భావిస్తున్నట్టు ఎక్స్ వేదికగా వెల్లడించింది.
మానసిక ఆరోగ్యం సరిగా లేదనందును నిరుడు నిడా దార్ ఆట నుంచి విరామం తీసుకుంది. ఏడాది కాలంలో తన ఆరోగ్యంపై దృష్టి సారించిన తను.. ‘ఇటీవలే మెరుగైంది. నా గురించి, నా బలాబలాలపై దృష్టి సారించడానికి సమయం తీసుకున్నా. నేను మళ్లీ పాకిస్థాన్ క్రికెట్కు అందుబాటులో ఉన్నాననే విషయం తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది’ అని నిడా దార్ తెలిపింది.
After taking time to focus on myself and regain my strength, I am happy to share that I am back and available for Pakistan Cricket Team once again. 🇵🇰
Ready to give my best, work hard and contribute whenever the team needs me.
Thank you to everyone who supported me during this… pic.twitter.com/CZTKXymSTI
— Nida Dar (@CoolNidadar) June 18, 2026
‘విరామం తర్వాత వస్తున్నందున .. అవకాశం లభిస్తే తన శక్తినంతా ధార పోస్తానని చెప్పిందీ మాజీ సారథి. నా అత్యుత్తమ ఆటను చూపాలనుకుంటున్నా. జట్టుకు అవసరమైనప్పుడు నా పాత్ర పోషించాలని భావిస్తున్నా. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని పేర్కొన్న 39 ఏళ్ల నిడాకు.. అంతర్జాతీయంగా 112 వన్డేలు, 160 టీ20ల అనుభవముంది.