– కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం
– ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూన్ 18 : రాష్ట్రంలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కేఈఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్రావు అన్నారు. గురువారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన ఓటరు ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల సమన్వయ కమిటీలో అర్హులకు స్థానం కల్పిస్తామన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు నిబద్ధతతో పని చేయాలన్నారు. కొత్తగూడెం నియోజవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు. సర్ మ్యాపింగ్ పేరుతో అధికార పార్టీ ఓట్లు తొలగించే కుట్ర చేస్తుందని దానిలో బిఎల్ఏలు అప్రమత్తం వ్యవహరించాలని సూచించారు.
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ తెలంగాణ జాతిపిత కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసేంత వరకు కార్యకర్తలు విశ్రమించోద్దన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దామోదర్, వనమా రాఘవేందర్రావు, కిరారు నాగేశ్వరరావు, కాపు కృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.