Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Raviteja) పై ఏదైనా విషయం ఎక్కువగా వార్తల్లో నిలిచిందంటే ..అది ఖచ్చితంగా రెమ్యునరేషన్ గురించే అని చెప్పాలి. అయితే ఈ నిర్ణయం నిర్మాతలకు భారమయ్యే అంశం కావడంతో రవితేజ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడట.

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ (Tollywood) హీరో రవితేజ (Raviteja) పై ఏదైనా విషయం ఎక్కువగా వార్తల్లో నిలిచిందంటే ..అది ఖచ్చితంగా రెమ్యునరేషన్ గురించే అని చెప్పాలి. క్రాక్ సినిమా రికార్డుల మోత కంటే ముందు పారితోషికం (Remuneration) విషయంలో కాంప్రమైజ్ అయిన రవితేజ..ఇపుడు మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ఒక్క సినిమాకు రూ.10 కోట్లకుపైనే పారితోషికం డిమాండ్ చేస్తున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మరోవైపు సినిమా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.
అయితే కరోనా మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైన సినీ పరిశ్రమ మళ్లీ గాడిలో పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రవితేజ పారితోషికం విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ నిర్ణయం నిర్మాతలకు భారమయ్యే అంశం కావడంతో రవితేజ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడట. ఇంతకీ ఆ రూట్ ఏంటనే కదా మీ డౌటు. హీరోయిన్ల సాయం తీసుకోవడం. సాధారణంగా సినిమా విషయంలో బడ్జెట్ పెరుగుతుందంటే ప్రధాన కారణం హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్.

ప్రస్తుత పరిస్థితుల్లో లీడింగ్ హీరోయిన్లను తీసుకుంటే పారితోషికం బాగా ఇవ్వాలి. అయితే అలాంటి అవసరం లేకుండా కొత్త హీరోయిన్లకు, మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశమివ్వాలని దర్శక నిర్మాతలకు సూచిస్తున్నాడట రవితేజ. ప్రస్తుతం రవితేజ నటిస్తోన్న ఖిలాడీ చిత్రంలో డింపుల్ హయతి (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేశారు. మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో దివ్యాంక కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ ముగ్గురూ పారితోషికం విషయంలో తక్కువే తీసుకుంటుండటంతో నిర్మాతలకు కూడా భారం తగ్గుతుంది. మొత్తానికి రవితేజ తన విషయంలో మాత్రం తగ్గేదేలేదు అంటూనే నిర్మాతల కోసం అప్ కమింగ్ హీరోయిన్ల సాయం తీసుకుంటుండటం ఆహ్వానించే విషయం అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
Avika Gor Maldives| మాల్దీవుల్లో అవికాగోర్ అందాల కనువిందు..వీడియో హల్చల్
Vikramarkudu sequel |విక్రమార్కుడు సీక్వెల్ దర్శకుడు ఇతడే..!
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

