టాటా గ్రూపునకు చెందిన ప్యాసింజర్ వాహన సంస్థ టాటా మోటర్స్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 78 శాతం తగ్గి రూ.859 కోట్లకు పరిమితమైంది.
సరఫరా వ్యవస్థలో అంతరాయాలు ఏర్పడటం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.4 వేల కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ.87,677 కోట్ల నుంచి రూ.95,799 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.