మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan)టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi )తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లెఫ్టినెంట్ రామ్ గా వస్తున్న ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. హను రాఘవపూడి టీం హైదరాబాద్, కశ్మీర్ లలో కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసింది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించేందుకు టీం మళ్లీ ఒక్క చోట చేరిపోనుంది.
కాగా ఈ చిత్రంలో మరో స్టార్ హీరోయిన్ భాగం కాబోతుందన్న వార్త ఫిలింనగర్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఇంతకీ ఆ భామ ఎవరో కాదు కన్నడ భామ రష్మిక మందన్నా (Rashmika Mandanna). స్వప్నా సినిమా, వైజయంతీ మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో నటిస్తోంది. మేకర్స్ అంతర్జాతీయ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తుండగా..రష్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అయితే ఈ షెడ్యూల్ డేట్ ఫైనల్ కావాల్సి ఉంది.
రష్మికను గతంలో నిర్మాతలు సంప్రదించగా డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో నో చెప్పినట్టు తెలుస్తోండగా..మొత్తానికి మళ్లీ రష్మిక హనురాఘవపూడి చిత్రానికి పచ్చ జెండా ఊపడంతో దర్శకనిర్మాతలు చాలా ఎక్జయిటింగ్ గా ఉన్నారని టాక్.
Sharwanand | 9 పాత్రల చుట్టూ ‘మహాసముద్రం’ : శర్వానంద్
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!