Samantha | బనారస్ చీరలో చెన్నై అందం మెరుపులు
పొట్టి డ్రెస్సులోనైనా, సంప్రదాయ చీరకట్టులోనైనా అందరినీ కట్టిపడేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha). అయితే ఇప్పటివరకు పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోసిన సామ్ ఈ సారి మాత్రం నిండుదనంతో కనిపించి సందడి చేస్తోంది.

పొట్టి డ్రెస్సులోనైనా, సంప్రదాయ చీరకట్టులోనైనా అందరినీ కట్టిపడేయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటోంది టాలీవుడ్ (Tollywood) భామ సమంత (Samantha). పెళ్లయిన తర్వాత విజయవంతంగా సినీ కెరీర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే..మరోవైపు హాట్ హాట్ ఫొటోషూట్లతో నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఇప్పటివరకు పొట్టి డ్రెస్సుల్లో అందాలు ఆరబోసిన సామ్ ఈ సారి మాత్రం నిండుదనంతో కనిపించి సందడి చేస్తోంది.
సమంత సంప్రదాయ బనారస్ చీరకట్టులో దిగిన పొటోలు ఇపుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రీతమ్ జుకాల్కర్ (Preetham Jukalker) డిజైన్ చేసిన ఎరుపు, బంగారపు వర్ణపు బనారస్ చీర (Banarasi sari)లో బంగారపు వర్ణపు చుక్కలతో ఉన్న హాఫ్ స్లీవ్ బ్లౌస్ లో ధగధగ మెరిసిపోతూ కెమెరాకు పోజులిచ్చింది. కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబైన సమంత లుక్కు నెట్టింట్లో కామెంట్ల వర్షం కురుస్తోంది. చాలా చాలా అందంగా ఉన్నావ్ అంటూ సామ్ స్నేహితురాలు శిల్పారెడ్డి కామెంట్ పోస్ట్ చేసింది. ఓ మై గాడ్ చాలా అందంగా ఉన్నావ్ అంటూ శ్రీదేవి జాస్తీ కామెంట్ పెట్టింది.
జతిన్ మోర్ జ్యువెల్లరీ వేసుకున్న సామ్ ను సాధనా సింగ్ మేకప్ చేయగా..ఇషాన్ గిర్రీ తన కెమెరాలో బంధించాడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది సమంత. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. సామ్ ప్రస్తుతం ముంబైకి మకాం మార్చి..రెండుకొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టిందని ఇప్పటికే వార్తలు రాగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

