Samantha Naga Chaitanya Divorce | అంత చిన్న గొడవ విడాకుల వరకు దారి తీసిందా.. అసలు కారణం ఇదే అట..

Samantha Naga Chaitanya Divorce reason | తెలుగు ఇండస్ట్రీలోనే కాదు మొత్తం సౌత్ ఇండస్ట్రీలో.. ఇప్పుడు సమంత, నాగ చైతన్య విడాకుల గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. వీళ్లు ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచిన కారణాలు వాళ్లు చెబుతున్నారు. అయితే అసలు కారణాలు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. అవి పూర్తిగా తమ వ్యక్తిగతమని.. సమయం వచ్చినప్పుడు కారణాలు బయట పెడతానంటూ అటు నాగ చైతన్య.. ఇటు సమంత ఒకరికి ఒకరు సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులకు సర్ది చెబుతున్నారు. అయితే ఇద్దరి మధ్య విడాకుల వరకు తీసుకొచ్చిన కారణాలు ఏమిటనేది మాత్రం అభిమానులు వదలడం లేదు.

తెలుసుకునే వరకు ఆరా తీయడం తమ బాధ్యత అంటున్నారు. ఈ క్రమంలోనే వాళ్లకు షాకింగ్ నిజాలు కొన్ని బయటకి తెలుస్తున్నాయి. అసలు ఎందుకు సమంత, నాగ చైతన్య విడిపోయారు అనే విషయం ఆరా తీయడం మొదలుపెడితే.. అందులో కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. గత ఏడాది కరోనా సమయంలో సమంత, నాగ చైతన్య మధ్యలో గొడవలు మొదలయ్యాయని తెలుస్తోంది. అప్పుడు వీళ్ల కెరీర్లో మాత్రమే కాదు.. అందరూ కెరీర్లో దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో పిల్లల కోసం ప్లాన్ చేయాలి అంటూ అక్కినేని కుటుంబం నుంచి సమంతకు ఒత్తిడి మొదలైందని తెలుస్తోంది. కానీ దీనికి ఆమె నుంచి నో అనే సమాధానమే వచ్చింది. తనకు పిల్లలు కనాలని ఉద్దేశం ఇప్పట్లో లేదని.. అసలు పిల్లల్ని కనను అంటూ చెప్పేసరికి. అక్కినేని ఫ్యామిలీ షాక్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.

బయట అక్కినేని కుటుంబానికి ఒక ఇమేజ్ ఉందని.. కచ్చితంగా పిల్లలు ఉండాల్సిందే అంటూ కుటుంబం నుంచి ఒత్తిడి ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సమంత ససేమిరా అనడంతో.. ఇక్కడే మాట మాట పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పిల్లల విషయంలో మొదలైన గొడవ తారాస్థాయికి చేరడంతో చివరికి విడాకుల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ సమంతకు చెప్పడానికి చాలా విధాలుగా ప్రయత్నించినా కూడా.. ఆమె వినడానికి సిద్ధంగా లేదని.. చివరికి విడాకులు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం ఇస్తుందని ఇరు కుటుంబాలు నమ్మారు. కరోనా సమయంలో పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే.. ఆ రెండు సంవత్సరాల గ్యాప్‌లో కెరీర్‌పై కూడా ఎలాంటి ప్రభావం పడదు అంటూ.. సమంతకు నచ్చచెప్పడానికి అక్కినేని కుటుంబ సభ్యులు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. తనకు పిల్లల్ని కనే ఉద్దేశం లేదని చెప్పడంతో అసలు సమస్య మొదలైందని.. అదే ఈ రోజు విడాకుల వరకు వచ్చేలా చేసిందని ప్రచారం జరుగుతుంది.
ఇది కూడా చూడండి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
Kangana: సమంత-చైతూ విడాకులకి కారణం ఆమీర్ ఖాన్..!
samantha naga chaitanya divorce | విడిపోయినప్పటికీ ఆ విషయంలో మాత్రం చైతూ, సమంత మాట ఒక్కటే..
భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
Samantha Naga Chaitanya Divorce reason Samantha Naga Chaitanya Divorce reason
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

