Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?

Naga chaitanya samantha divorce | సమంత నాగచైతన్య విడాకులు గురించి టాలీవుడ్ లో చాలా రోజుల నుంచి వస్తున్న వార్తలు నిజమయ్యాయి. సమంత, నాగ చైతన్య అధికారికంగా విడిపోయారు. ఈ విషయాన్ని సమంత, నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఇప్పుడు చై సామ్ విడాకులు ( chai sam divorce ) వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సమంత విడాకుల వెనుక కారణాలు, నాగ చైతన్య ఇచ్చే భరణం అంశాల గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత చాలా బోల్డ్‌గా నటించడంతోనే అసలు వివాదం మొదలైందని తెలుస్తోంది. ఈ వివాదాలతో చైతూ.. సామ్‌ను చాలాసార్లు ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ కూడా ఇప్పించారని.. అయినా కూడా ఎలాంటి ఫలితం లేదని సమాచారం. డివోర్స్ ప్రాసెస్‌లో భాగంగా స్థిర, చర ఆస్తులతో కలిపి సమంత కు భరణం కింద 50 కోట్లు ఇవ్వనున్నారని కొందరు చెబుతుంటే.. మరి కొందరు 250 నుండి 300 కోట్ల వరకు అక్కినేని ఫ్యామిలీ ఇవ్వనుందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాలంటే చైతూ- సామ్లలో ఒకరు స్పందించిక తప్పదు.
సమంత, నాగ చైతన్య విడాకుల విషయంపై ముందుగా సోషల్ మీడియా వేదికగా సమంత స్పందించింది. అధికారికంగా భర్త నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఎన్నో రోజుల తీవ్రమైన చర్చల తర్వాత ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటూ ఎమోషనల్‌గా పోస్టు పెట్టింది సమంత. ఇకపై ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు అభిమానులతో అసలు విషయం పంచుకుంది. నాలుగేళ్ల వివాహ బంధం.. పదేళ్లకు పైగా అతనితో స్నేహం.. జీవితంలో తనకు ఎన్నో విషయాలు నేర్పించింది అని.. ఎప్పటికీ దానికి అతనికి రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేసింది సమంత.
ఇక నాగచైతన్య కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. సమంతతో సంప్రదింపుల తర్వాత ఇద్దరం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామని నాగ చైతన్య తన ట్వీట్లో తెలిపారు. తమ కెరీర్లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు చైతూ చెప్పాడు. దాదాపు దశాబ్ధ కాలం పాటు తమ మధ్య స్నేహం కొనసాగిందని, అదే తమ మధ్య బంధాన్ని బలపరిచినట్లు తెలిపాడు. అది ఎప్పటికీ మరువలేనిదన్నాడు. క్లిష్ట తరమైన సమయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని చైతూ తన ట్వీట్లో కోరాడు. తమకు ప్రైవసీ ఇవ్వాలని వేడుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
samantha naga chaitanya divorce | మేం విడిపోతున్నం.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య, సమంత
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Sri Reddy | సంసారంలో సరిగమలు సహజం..సమంతకు శ్రీరెడ్డి సూచన..వీడియో వైరల్
హైదరాబాదే నా ఇళ్లు.. నాకు అన్నీ ఇచ్చింది : సమంత
Samantha | హ్యాపీ మూడ్‌లో సమంత..ఈ స్పెషల్ వీడియో చూడండి
సమంతతో నటించాలని ఉందన్న బాలీవుడ్ స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

