ఎన్టీఆర్ సినిమాలో ఆఫర్ వస్తే ఆర్.నారాయణమూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడు?

r narayana murthy rejected NTR temper movie | ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమాలో మూర్తి అనే కానిస్టేబుల్ పాత్ర గుర్తుందా ! అదేనండీ.. పోసాని కృష్ణమురళి చేసిన పాత్ర !! హీరోను మార్చే క్యారెక్టర్లలో ఇది కూడా ఒకటి. ఎన్టీఆర్ లంచగొండితనాన్ని మొహం మీదనే వ్యతిరేకించే కానిస్టేబుల్ మూర్తి పాత్ర ఆ సినిమాకే హైలెట్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ సెల్యూట్ చేయమని సీరియస్ అయినప్పుడు.. నా చేతిని అయినా నరుక్కుంటా కానీ మీకు మాత్రం సెల్యూట్ చేయనని పోసాని చెప్పే డైలాగ్ జనాలకు ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. అంతలా పాపులర్ అయింది ఆ పాత్ర. ఇంతటి ముఖ్యమైన రోల్‌కు దర్శకుడు పూరీ జగన్నాథ్ ముందుగా అనుకున్నది పోసానిని కాదట !. పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి కోసం కానిస్టేబుల్ పాత్రను రాసుకున్నాడట పూరీ జగన్నాథ్. అందుకే ఆ కానిస్టేబుల్ పాత్రకు మూర్తి అనే పేరును పెట్టాడు పూరీ. ఇదే విషయం ఆర్.నారాయణమూర్తికి చెప్పి సినిమాలో ఆఫర్ ఇస్తే.. ఆ పాత్ర చేయలేనని రిజెక్ట్ చేశాడట మన పీపుల్స్ స్టార్. జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒప్పించేందుకు ట్రై చేసినా కూడా ఆర్.నారాయణమూర్తి వినిపించుకోలేదట. అయితే టెంపర్ సినిమాను రిజెక్ట్ చేయడానికి గల కారణాన్ని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఆర్.నారాయణమూర్తి.
టెంపర్ సినిమాలో ఆ పాత్ర ఆర్.నారాయణ మూర్తి చేస్తే సినిమా ఆడేస్తుందని పూరీ జగన్నాథ్ ఆ ఆఫర్ ఇవ్వలేదు. నాతో ఆయన ఒక డిఫరెంట్ వేషం.. గొప్ప వేషం వేయించాలని అనుకున్నాడు. ఆ క్యారెక్టర్ నాకు ఉపయోగపడాలని ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంత గొప్ప పాత్రను ఇవ్వాలని అనుకున్న పూరీ జగన్నాథ్‌కు నా సెల్యూట్. ఈ సినిమాలో నటించమని జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రేమగా అడిగారు. కానీ ఈ పాత్ర నేనుచేయలేను మన్నించండి అని సున్నితంగా ఆ అవకాశాన్ని తిరస్కరించా అని చెప్పుకొచ్చాడు ఆర్. నారాయణమూర్తి. టెంపర్‌లో అవకాశం ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో కారణాన్ని కూడా వివరించాడు. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోగా ఎదిగాను.. ఇక చేస్తే ఐదారేండ్లకు మించి సినిమాలు చేయలేను. ఇలాంటి సమయంలో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెనక్కి వెళ్లదలచుకోలేదని చెప్పాడు ఆర్.నారాయణమూర్తి. ఆ ఉద్దేశంతోనే టెంపర్ సినిమాలో ఆఫర్ వదులుకున్నా తప్ప.. మరే కారణం లేదని వివరించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక అమ్మాయిని ఇష్టపడ్డ ఆర్.నారాయణమూర్తి.. పెండ్లి చేసుకుందాం అనుకుంటే..
మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి
Jr NTR | షూటింగ్‌కు ఎన్టీఆర్ ప్యాకప్..!
Samantha | ఎన్టీఆర్ తో సమంత సందడి ..క్రేజీ అప్ డేట్..!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

