కోట్లు సంపాదించా.. ఇంటి అద్దె కట్టలేనా.. ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మీద ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా హల్ చల్ చేశాయి. ఈయన కనీసం ఇంటి అద్దె కట్టుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రజా గాయకుడు గద్దర్ ఒక సమావేశంలో తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీలో పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాడు ఈయన. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు నారాయణ మూర్తి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇలాంటి విప్లవ హీరో మీద ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు బాగా హల్ చల్ చేశాయి. ఈయన కనీసం ఇంటి అద్దె కట్టుకోలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ప్రజా గాయకుడు గద్దర్ ఒక సమావేశంలో తెలిపారు. గద్దర్ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి.
ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఆర్.నారాయణమూర్తికి ఇలాంటి పరిస్థితి వచ్చిందా అంటూ అభిమానులు చాలా బాధ పడ్డారు. దీనిపై ఇప్పుడు ఆయన స్పందించాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచురించారని.. తాను ఆర్థిక ఇబ్బందుల్లో లేనని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న కథనాలను ఖండించాడు పీపుల్స్ స్టార్ ఆర్ . నారాయణమూర్తి. ఇంటి అద్దె కట్టలేని స్థితిలో ఉన్నాడంటూ గద్దర్ చెప్పిన మాటలను వక్రీకరించారని నారాయణమూర్తి ఆవేదన చెందాడు. పల్లెటూరి వాతావరణంలో గడపడం ఇష్టం కాబట్టే సిటికి దూరంగా ఉంటున్నానని క్లారిటీ ఇచ్చాడు నారాయణ మూర్తి. ఆటోలో రాకపోకలకే నెలకు రూ.30 వేలు ఖర్చవుతాయి.. అలాంటిది ఇంటి అద్దె కట్టుకోలేనా అంటూ ప్రశ్నించాడు.
సోషల్ మీడియాలో అవాస్తవాలు రాయడం నా మనసుకు బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆర్థిక సహాయం చేస్తామంటే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ ఎమోషనల్ అయ్యాడు నారాయణమూర్తి. 40 ఏళ్ల కెరీర్లో తాను కోట్లు సంపాదించానని.. తన వరకు సరిపడ దాచుకున్నానని.. మిగతాది సేవా కార్యక్రమాలకు ఇచ్చానని క్లారిటీ ఇచ్చాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై రాసిన అవాస్తవాలు చదివి చాలా బాధ పడ్డట్టు తెలిపాడు నారాయణ మూర్తి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సినిమాలు వదిలేసి.. వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా: శ్రీకాంత్
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

