అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్

అఖిల్‌కు ఒక్క హిట్టయినా వస్తే బాగుంటుందని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు అక్కినేని నాగార్జున. తనయుడికి హిట్ అందించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. వినాయక్, విక్రమ్ కె. కుమార్ వంటి దర్శకులతో సినిమాలు చేసినా కోరుకున్న విజయాన్ని అందించలేకపోయాయి. ప్రస్తుతం బొమ్మరిల్లు దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్నాడు అఖిల్. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఏజెంట్ సినిమాలో అఖిల్ తండ్రిగా, గురువుగా మమ్ముట్టి కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో ఆయన్ను నటింపజేయడానికి నాగార్జునే స్వయంగా రంగంలోకి దిగాడంట. నాగ్ స్వయంగా ఫోన్ చేసి అడగడంతో ఈ పాత్రలో మమ్ముట్టి కాదనలేకపోయాడని తెలుస్తోంది. ఇప్పటికే స్వాతికిరణం, యాత్ర వంటి డైరెక్ట్ సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు మమ్ముట్టి. అయితే ఈ పాత్రలో నటించాలని నాగార్జున ముందుగా ఆశపడ్డాడట. తండ్రీకొడుకులు కలిసి నటిస్తే ఈ సినిమాపై అంచనాలు కూడా బాగానే ఉంటాయి. బిజినెస్ కూడా బాగా జరుగుతుందని నిర్మాతలు కూడా ఓకే అన్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం దీనికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది.
ఒక్కసారి సినిమాల్లోకి నాగార్జున ఎంటర్ అయితే అంచనాలు పెరిగిపోతాయి.. కథ కూడా మార్చాల్సి వస్తుంది.. ఆయన ఇమేజ్‌కు తగ్గట్లు స్టోరీ మార్పులు చేయాల్సి వస్తుంది. అలాకాకుండా ఉన్నది ఉన్నట్లు తీస్తే నాగ్ అభిమానులు హర్ట్ అయ్యే చాన్స్ ఉంది. పోనీ కథలో మార్పులు చేస్తే అఖిల్ కంటే ఎక్కువగా నాగార్జునకు పేరు వస్తుంది. పైగా ఇది అఖిల్ సినిమా కాకుండా నాగ్ సినిమా అయిపోతుంది. ఇవన్నీ లిటికేషన్స్ ఉండటంతో నాగార్జునకు బదులు మమ్ముట్టిని తీసుకోవాలని అనుకున్నాడు సురేందర్ రెడ్డి. కారణం ఏదైనా సురేందర్ రెడ్డి వల్ల నాగార్జున, అఖిల్ కలిసి నటించే అవకాశం మాత్రం మిస్ అయిపోయిందని అభిమానులు బాధపడుతున్నారు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కచ్చితంగా కొడుకుతో కలిసి నటిస్తానని ఇదివరకే చెప్పారు నాగార్జున.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
గోవా బీచ్‌లో విజయ్ దేవరకొండతో ఎంజాయ్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ
900 కోట్ల రూపాయల అప్పు చేసిన అమితాబ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

