టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్టు పుష్ప. పాన్ ఇండియా స్టోరీ బ్యాక్ డ్రాప్ లో అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కీ రోల్ పోషిస్తున్నారు. పుష్పలో ఫహద్ ఫాసిల్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఫహద్ ఫాసిల్ నోరు విప్పి..పుష్పలో తన పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పేశాడు.
తన అప్ కమింగ్ సినిమా మాలిక్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ..పుష్పలో నా పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుంది. నా వయస్సుతో సంబంధం లేని పాత్ర చేశా. ఈ రోల్ కోసం ఫిజికల్ టాన్స్ ఫార్మేషన్ ఫాలో అయ్యా. పుష్పలో 30 ఏళ్ల వ్యక్తిగా కనిపించేందుకు చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా రాబోతుంది. కన్నడ భామ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఫహద్ ఫాసిల్ హీరోగా నటిస్తున్న కన్నడ చిత్రం మాలిక్ మాలిక్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్కడికి వెళ్లిందో..?
అఖిల్ కండలు చూసి అవాక్కవుతున్న ఫ్యాన్స్
తేజ్‌ను చూస్తే ఎమోషనల్ అవుతా: కొరటాల శివ
సైకిల్ తో సన్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైరల్
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి