e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home News 100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరువాల‌న్న కోరిక ఒక్క‌టే ఉంటే స‌రిపోదు. ఛాన్స్ ల కోసం స్టూడియోల చుట్టూ తిరిగే ఓపిక‌, వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకునే ల‌క్ష‌ణం రెండూ ఉండాలి. ఈ రెండు ల‌క్ష‌ణాలు ప‌ర్‌ఫెక్ట్‌గా ఉన్న అందాల భామ దివి వైద్య‌. బిగ్‌బాస్ సీజ‌న్ 4లోకి ఎంట్రీ ఇచ్చే వ‌ర‌కు దివి వైద్య ఎవ‌రో ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ బిగ్ బాస్ సీజ‌న్ 4కు చీఫ్ గెస్ట్ గా వ‌చ్చిన మెగాస్టార్ చిరంజీవి..దివిని పొగడ్త‌ల‌తో ముంచెత్తేస‌రికి ఆమె ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఓ వైపు బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు, చిరు ప్ర‌శంస‌ల‌తో ఇమేజ్ సంపాదించుకుని హాట్ టాపిక్ గా మారిపోయింది దివి.

ఈ భామ హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ (టీవీ) -2020 టైటిల్ కూడా గెలుచుకుని ద‌ర్శ‌క నిర్మాత‌ల ఫోక‌స్ త‌న‌పై ప‌డేలా చేసుకుంది. అయితే గ్లామ‌రస్ ప్ర‌పంచంలో తన‌కీ గుర్తింపు అంత సుల‌భంగా రాలేద‌ని అంటోంది దివి. ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంది దివి. టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ టైటిల్‌ను గెలుచుకున్న‌ట్టు కాల్ రాగానే నాకు పిచ్చెక్కిపోయింది. నేనెప్పుడూ దీనికోసం ప్ర‌య‌త్నించలేదు. ఈ టైటిల్ ను ఎలాంటి క‌ష్టం లేకుండా అందుకున్నాన‌ని చెప్పింది.

- Advertisement -

అయితే సినిమాల‌పై ఉన్న ఫ్యాష‌న్ తో మూవీ ఆడిష‌న్స్ కు వెళ్ల‌గా..సుమారు 100 సార్ల‌కు పైగా త‌న‌ను తిర‌స్క‌రించార‌ని చెప్పింది. తిర‌స్క‌రించిన ప్ర‌తీసారి తాను మ‌రింత స్ట్రాంగ్‌గా మార‌కుంటూ వ‌చ్చానంది దివి. నేను చిరంజీవి సినిమాలో న‌టిస్తున్నా. మ‌రో మూడు నెల‌ల్లో షూటింగ్ మొద‌లు కానుంది. పెద్ద స్టార్ల చిత్రాల‌లో న‌టించాల‌ని నాకు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. పెద్ద సినిమాల్లో ఇలా ఆఫ‌ర్ రావ‌డం సంతోషంగా ఉంది. ఈ రోజు కోస‌మే నేను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నా. క‌ష్ట‌ప‌డితే త‌ప్ప‌కుండా ఫలితం ల‌భిస్తుంద‌ని భావిస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది దివి.

సిల‌క ముక్కు దానా అంటూ సాగే ఓ ప్రైవేట్ సాంగ్ లో మెరిసింది దివి. ఈ పాట సూప‌ర్ హిట్ గా నిలిచి 1.7 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ రాబ‌ట్టింది. అయితే త‌న‌పై విమ‌ర్శ‌లు రావ‌డంపై స్పందిస్తూ.. ఈ పాట కోసం డ్యాన్స్ చేయ‌డానికి ప‌డ్డ క‌ష్టం నేనెప్పుడూ ప‌డ‌లేదు. నాకు మోకాలి నొప్పులు, తిమ్మిర్లు వ‌చ్చినా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేశాను. నా డ్యాన్స్ పై విమ‌ర్శ‌లు చేసే వారికి చిల‌క ముక్కు దాన పాట‌నే స‌మాధాన‌మ‌ని చెప్పింది దివి. కాస‌ర్ల శ్యామ్ రాసిన ఈ పాట‌ను హారిక నారాయ‌ణ్ పాడింది. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు.

ఇవి కూడా చదవండి..

శ్రియా శరణ్ క‌థ‌క్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో

భర్తతో పబ్లిక్ రొమాన్స్‌..శ్రియ‌పై నెటిజ‌న్ల‌ సెటైర్లు

పాపుల‌ర్ బ్రాండ్ తో ‘అందాల రాక్ష‌సి’ డీల్‌

విడుద‌ల‌కు ముందే ఖ‌ర్చులు వ‌చ్చేశాయి..!

చీర‌లో ఆదాశ‌ర్మ మార్ష‌ల్ ఆర్ట్స్..వీడియో వైర‌ల్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana