పొట్టి డ్రెస్లో అయినా, చీరకట్టులో అయినా తన అందచందాలతో అందరినీ కట్టిపడేస్తుంది ఆదాశర్మ. ఈ ముంబై భామ లాక్ డౌన్ టైంలో ఇంట్లోనే ఉండి బోర్ కొడుతున్న వారికి సోషల్ మీడియా ద్వారా రకరకాల టిప్స్ చెప్పింది. అప్పడపుడు వర్కవుట్స్ సంబంధించిన వీడియోలను, సెల్ఫ్ డిఫెన్స్ వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఆదాశర్మ యెల్లో కలర్ హాఫ్ శారీలో సిలంబమ్ (మార్షల్ ఆర్ట్స్ లో ఉపయోగించే కర్ర) చేత పట్టుకుని బీచ్లో మార్షల్ ఆర్ట్స్ కళను ప్రదర్శించింది.
ఓ వైపు సముద్ర అలలు ఎగిసిపడుతూ భీకరమైన శబ్దం చేస్తుంటే బీచ్లో చాలా ధైర్యంగా మార్షల్ ఆర్ట్స్ చేసింది. అదే సమయంలో బీచ్ వెంబడి శునకాల సైన్యం ఆదాశర్మ వైపు వచ్చింది. ఆదాశర్మ శునకాలను దగ్గరకు పిలుస్తూ..ఆ తర్వాత వాటితో కలిసి బీచ్ వెంట పరుగులు పెట్టింది. మన్ డే మోటివేషన్ పేరుతో కొత్త స్నేహితులను ఏర్పరచుకోవడం ఎలా అంటూ ఆదాశర్మ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న