సినిమాలు వదిలేసి.. వ్యవసాయం చేసుకుందాం అనుకున్నా: శ్రీకాంత్
తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన కథానాయకుడు శ్రీకాంత్. ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు శ్రీకాంత్.

తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. స్టార్ హీరోగా ఎదిగిన కథానాయకుడు శ్రీకాంత్. ఎక్కడో కర్నాటకలోని బళ్లారి నుంచి వచ్చిన ఈయన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చాడు. 1990లో ఇండస్ట్రీకి వచ్చిన ఈయన ఇప్పటికి దాదాపు 120 సినిమాలకు పైగా నటించాడు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు శ్రీకాంత్. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిన శ్రీకాంత్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు శ్రీకాంత్.
ఒకానొక సమయంలో ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదామని, ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని ఆలోచించినట్టు చెప్పాడు. దానికి ప్రత్యేకమైన కారణాలేమీ లేవు.. వరుస పరాజయాలు రావడమే. ఒకప్పుడు ఏడాదికి అరడజన్ సినిమాలు విడుదల చేసేవాడు శ్రీకాంత్. అందులో దాదాపు రెండు మూడు విజయాలు వచ్చేవి. అలా కెరీర్లో ఎన్నో సంచలన విజయాలు అందుకొన్నాడు శ్రీకాంత్. అయితే ఒక సమయంలో ఈయన కెరీర్ డైలమాలో పడిపోయింది. ఒక ఏడాదిలో ఈయన నటించిన 7 సినిమాలు విడుదలయ్యాయి.. అందులో ఒక్కటి కూడా విజయం సాధించలేదు. దాంతో చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు శ్రీకాంత్. ప్రేక్షకులు తనను చూడడానికి సిద్ధంగా లేరా.. ఇంక తన సినిమాలు చూడరా.. తనను యాక్సెప్ట్ చేయడం ఆపేశారా అని ఎన్నో అనుమానాలు ఆయన మదిలో వచ్చాయి.
అందుకే సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆప్తుడైన మెగాస్టార్ చిరంజీవితో చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పిన కొన్ని మాటలు శ్రీకాంత్ నిర్ణయం మార్చుకునేలా చేశాయి. ఇండస్ట్రీ అన్నాక ప్రతి ఒక్కరికీ జయాపజయాలు సర్వ సాధారణం అని.. కిందకు పడిపోయినప్పుడు పైకి ఎలా లేవాలి అని ఆలోచించాలి గానీ.. పూర్తిగా ఆట నుంచి తప్పుకోకూడదు అని చిరంజీవి చెప్పిన మాటలు మళ్లీ తనతో స్ఫూర్తిని రగిలించాయి అంటున్నాడు శ్రీకాంత్. ఆ తర్వాత మళ్లీ వరుస సినిమాలు చేయడం.. విజయాలను అందుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు శ్రీకాంత్. ఆయన తనయుడు రోషన్ హీరోగా పెళ్లిసందడి సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు ఈ సీనియర్ హీరో.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
రెండు నెలలుగా ఐసీయూలోనే హీరోయిన్ తనయుడు
అఖిల్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి.. నాగార్జునకు ఛాన్స్ మిస్
30 ఏళ్ల వ్యక్తిలా కనిపించేందుకు చాలా కష్టపడ్డా: ఫహద్ ఫాసిల్
ఇంత వరకు రీమేక్‌ల వైపు కన్నేయని మహేష్.. ఎందుకో తెలుసా?
ప్రశాంత్ నీల్.. నాలుగు నెలల్లో రెండు పాన్ ఇండియన్ సినిమాలు
ఇండస్ట్రీలోకి కోడిరామకృష్ణ కూతురు ఎంట్రీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

