మళ్లీ ఎమోషనల్ అయిన ఆర్.నారాయణమూర్తి..
కన్నతల్లి లాంటి థియేటర్ వ్యవస్థ కళ్లముందే నాశనం అయిపోతుంది అంటూ ఎమోషనల్ అయిపోయాడు ఆర్. నారాయణమూర్తి. అన్నం పెడుతున్న ఇండస్ట్రీ పాడైపోతుంటే చూడలేను అంటున్నాడు.

సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి విషయంపై స్పందించే అలవాటు ఆర్.నారాయణమూర్తికి ఉంది. తనకు అన్నం పెడుతున్న ఇండస్ట్రీ పాడైపోతుంటే చూడలేను అంటున్నాడు ఈయన. కన్నతల్లి లాంటి థియేటర్ వ్యవస్థ కళ్లముందే నాశనం అయిపోతుంది అంటూ ఎమోషనల్ అయిపోయాడు ఆర్. నారాయణమూర్తి. కరోనా కష్టకాలంలో అందరికీ కన్నీరే మిగిలిందని.. ఇలాంటి సమయంలో వినోదం కావాలంటే సగటు ప్రేక్షకుడు కోరుకునేది సినిమా మాత్రమే అంటున్నాడు. థియేటర్స్ ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్లి నవరసాలను ఆస్వాదిస్తాడు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు నారాయణ మూర్తి. దయచేసి ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం ఆపాలంటూ నిర్మాతలకు ఆయన విజ్ఞప్తి చేశాడు.
సినిమా అనేది కచ్చితంగా థియేటర్లో చూడాలి అని.. నాలుగు గోడల మధ్య చూస్తే సినిమాకు ఉన్న ఎమోషన్ తెలియదు అంటున్నాడు నారాయణమూర్తి. ఉదాహరణకు మొన్న నారప్ప సినిమా విడుదలైందని.. అది కేవలం 25 శాతం మంది మాత్రమే చూశారని అంటున్నాడు. మిగిలిన 75 శాతం వాళ్ల ఇంట్లో ఓటీటీ లేదు అని.. మరి అలాంటి వాళ్లు వెంకటేష్ సినిమా చూడకుండా ఏం పాపం చేశారని అంటున్నాడు ఆర్. నారాయణమూర్తి. పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు ఓటీటీ ఉండదు కదా.. మరి వాళ్లు సినిమాలు ఎలా చూడాలంటూ ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీని అందరూ ఆహ్వానించాల్సిందే.. అనుసరించాల్సిందే.. కానీ అది అట్టడుగు వర్గానికి చేరినప్పుడే అసలైన సార్థకత ఉంటుంది అంటున్నాడు ఈయన.
ఓటీటీ రిలీజ్ అనేది కేవలం 25 శాతం మంది వరకు మాత్రమే వెళ్తుందని.. మిగిలిన 75 శాతం కేవలం థియేటర్లలోనే సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటున్నాడు. అందరికి ఓటీటీ సినిమాలు చేరువైనప్పుడు తాను కూడా ఒప్పుకుంటాను అంటున్నాడు. కరోనా వస్తుంది పోతుంది కానీ థియేటర్స్ మాత్రం ఎప్పటికీ శాశ్వతం అంటున్నాడు పీపుల్స్ స్టార్. దయచేసి ఇండస్ట్రీ పెద్దలు అంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుని భారీ సినిమాలు విడుదల చేయాలని కోరుకున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రేక్షకులు థియేటర్లకు ఈ పరిస్థితుల్లో పెద్ద సినిమాలు విడుదల కావాల్సిందే.. ఆ వైపుగా మార్గ నిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటున్నాడు ఆర్ నారాయణ మూర్తి. అంతేగాని థియేటర్లో చూడాల్సిన సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తే.. మన చేతులతో మనమే థియేటర్స్ వ్యవస్థను చంపేసినట్లు అవుతుంది అంటున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయంపై ఒకసారి ఆలోచించాలి అని విజ్ఞప్తి చేశాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో బిగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

