రెండో పెళ్లికి సిద్ధమైన అక్కినేని మనుమడు.. నెట్టింట పెళ్లి కార్డు వైరల్
టాలీవుడ్లో మరో హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అక్కినేని మనుమడు సుమంత్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

టాలీవుడ్లో మరో హీరో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. అక్కినేని మనుమడు సుమంత్ ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇరు కుటుంబ పెద్దలు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సుమంత్, పవిత్రల వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. సుమంత్ కుమార్ వెడ్స్ పవిత్ర వివాహానికి ఇదే మా ఆహ్వానం అంటూ ఆ శుభలేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ కార్డులో SP అనే అక్షరాలను హైలైట్ చేస్తూ తీర్చిదిద్దారు. అయితే ఈ ఇన్విటేషన్ కార్డులో పెళ్లి తేదీ, వివాహ వేదిక వంటి వివరాలు లేకపోవడంతో సుమంత్ పెళ్లిపై కొద్దిగా సస్పెన్స్ నెలకొంది.

సుమంత్‌కు 2004లో నటి కీర్తిరెడ్డితో వివాహం జరిగింది. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలి ప్రేమ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్లలోపే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కీర్తి రెడ్డి రెండో పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. కానీ సుమంత్ మాత్రం సింగిల్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సుమంత్ పెళ్లి కార్డు నెట్టింట వైరల్‌గా మారింది. అక్కినేని నాగేశ్వరరావు మనుమడిగా ప్రేమకథ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుమంత్. ఆ తర్వాత సత్యం, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా వంటి చిత్రాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సుమంత్ అనగనగా ఒక రౌడీ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో వాల్తేరు శీను అనే పక్కా మాస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
చిరంజీవి బ్లాక్ బస్టర్ రీమేక్‌లో పవన్ కళ్యాణ్
పవన్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో
RRR ప్రమోషన్స్ | ఐదు భాషల్లో దోస్తీ సాంగ్.. ఒక్కో భాషలో ఒక్కో సింగర్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
బుచ్చిబాబు మళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

