పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడేళ్ల వరకూ డేట్స్ దొరకడం కూడా కష్టంగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాలు కమిట్ అయిన పవర్ స్టార్.. అందులో రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి చేస్తున్నాడు. ఒకే రోజు రెండు సినిమాల షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇంత బిజీగా ఉన్న ఈయన తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అది కూడా చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమా కావడం గమనార్హం.
1987లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా జేబు దొంగ. భానుప్రియ, రాధ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది.
పక్కా కమర్షియల్ కథతో వచ్చిన జేబుదొంగ అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇప్పుడు ఈ సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని ఒక అగ్ర నిర్మాత భావిస్తున్నాడు. ఇదే ప్రపోజల్ పవన్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. ఒక మాస్ డైరెక్టర్ జేబుదొంగ రీమేక్ పవన్ కళ్యాణ్ తో ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాటి జేబుదొంగ సినిమాలో సత్యనారాయణ, గొల్లపూడి మారుతీ రావు, షణ్ముఖ శ్రీనివాస్, రఘువరన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడ ప్రభాకర్ విలన్‌గా యాక్ట్ చేశారు.
ఇప్పుడు ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒరిజినల్ చెడగొట్టకుండా కథను తీసుకొని పవన్ ఇమేజ్ సరిపోయేలా స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సిందిగా.. ఒక దర్శకుడికి ఇప్పటికే పని అప్పచెప్పినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ సినిమా పూర్తయిన వెంటనే ఇది మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే చిరంజీవి సినిమాను పవన్ రీమేక్ చేస్తే అభిమానులకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు
పవన్-రానా రీమేక్ ప్రాజెక్టు మేకింగ్ వీడియో
RRR ప్రమోషన్స్ | ఐదు భాషల్లో దోస్తీ సాంగ్.. ఒక్కో భాషలో ఒక్కో సింగర్
శాకుంతలంలో పాపులర్ టీవీ హోస్ట్
టైగర్ 3..ఎంట్రీ సీన్ కే రూ.10 కోట్లు ఖర్చు..!
ఆ సీక్రెట్ ముగ్గురికి మాత్రమే తెలుసు: సత్యదేవ్
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
బుచ్చిబాబు మళ్లీ ఆ హీరోనే కావాలంటున్నాడా..?