పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు.. నా వరకు పవర్ స్టార్ అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.. అతడు తప్ప మరో పవర్ స్టార్ లేడని అన్నాడు పునీత్ రాజ్‌కుమార్.

పవర్ స్టార్ అంటే మనకు పవన్ కళ్యాణ్. మనలాగే కన్నడ ప్రేక్షకులకూ ఓ పవర్ స్టార్ ఉన్నాడు.. అతడే పునీత్ రాజ్‌కుమార్. కర్ణాటకలో ఈయన చాలా పెద్ద హీరో. ఈయన చేసిన 20 సినిమాల్లో 18 విజయాలు ఈయన సొంతం. ఈ స్థాయి సక్సెస్ రేట్ ఉన్న హీరో సౌత్ ఇండస్ట్రీలోనే లేడని చొప్పొచ్చు. ఇటీవల యువరత్న సినిమాతో తెలుగు ప్రేక్షకులనూ పలకరించాడు పునీత్ రాజ్ కుమార్. ఈ సినిమా కోసం హైదరాబాద్ వచ్చి బాగానే ప్రమోషన్ కూడా చేశాడు.. కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో కూడా వచ్చేసింది. ఈ విషయం పక్కన పెడితే.. ఇకపై తనను పవర్ స్టార్ అని పిలవద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పునీత్.
” నన్ను పవర్ స్టార్ అని పిలవద్దు.. నా వరకు పవర్ స్టార్ అంటే కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే.. అతడు తప్ప మరో పవర్ స్టార్ లేడని” అన్నాడు పునీత్ రాజ్‌కుమార్. అందుకే తన పేరు మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇకపై తనను పవర్ స్టార్ అని కాకుండా కేవలం పునీత్ రాజ్‌కుమార్ అని మాత్రమే పిలవాలని అభిమానులకు సూచించాడు. ఇకపై ఎప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చిన కేవలం పునీత్ అని మాత్రమే పిలవాలని పవర్ స్టార్ పునీత్ అని పిలవద్దని రిక్వెస్ట్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పరంగా చూస్తే తనకు పవర్ స్టార్ అనే బిరుదు సరిపోదని చెప్పాడు. పునీత్ మర్యాదను చూసి మన ఆడియన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
జంధ్యాల అహ నా పెళ్లంటలో కోట పాత్రకు ముందుగా ఎవర్ని అనుకున్నారో తెలుసా
చెప్పిన డేట్‌కి వస్తున్న మెగాస్టార్
23 ఏళ్ళ కిందే సినిమాలు వదిలేద్దాం అనుకున్నా: పవన్ కళ్యాణ్
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

