పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథే

power star puneeth rajkumar | పునీత్ రాజ్ కుమార్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ పేరు సంచలనం అయిపోయింది. చాలా చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన కేవలం 46 ఏళ్ల వయసులో మృతి చెందడం నమ్మలేకపోతున్నారు అభిమానులు. ఆయన మృతి వార్త తెలిసిన తర్వాత కన్నీరుమున్నీరవుతున్నారు. తమ పవర్ స్టార్ తమకు కావాలి తీసుకొచ్చి ఇవ్వండి అంటూ హాస్పిటల్ బయట ఆర్తనాదాలు పెడుతున్నారు. వాళ్ళ కన్నీటిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఇదిలా ఉంటే ఇంతటి స్టార్ డమ్ సంపాదించిన పునీత్ రాజ్ కుమార్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది మన తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ ( puri jagannadh ).
అప్పటికే బాలనటుడిగా దాదాపు 20 చిత్రాలకు పైగా నటించిన పునీత్ ఎంట్రీ కోసం.. లెజండ్రీ నటుడు, ఆయన తండ్రి రాజ్ కుమార్ సరైన కథల కోసం వెతుకుతున్నాడు. అలాంటి సమయంలో పూరీ జగన్నాథ్ చెప్పిన అప్పు కథ ఆ కుటుంబానికి బాగా నచ్చింది. వెంటనే ఆయనపై నమ్మకంతో కొడుకు ఎంట్రీని ఆయన చేతుల్లో పెట్టేశాడు రాజ్ కుమార్. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పు సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. అదే సినిమాను తెలుగులో తర్వాత ఇడియట్ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా. అప్పు తర్వాత అదే పేరుతో అభిమానులు పునీత్ ను పిలుచుకుంటున్నారు.
ఇప్పటి వరకు 29 సినిమాలలో నటించిన ఈయన.. దాదాపు 25 విజయాలు అందుకొన్నాడు. 90 శాతానికి పైగా సక్సెస్ రేటు.. 100 కోట్ల మార్కెట్ ఉన్న ఏకైక సౌత్ హీరో పునీత్ రాజ్ కుమార్. కర్ణాటకలో ప్రస్తుతం నెంబర్ వన్ హీరో ఆయన. అలాంటి సూపర్ స్టార్ హఠాత్తుగా మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఆయన లేని లోటు ఎలా భర్తీ చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు అభిమానులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
Puneeth Rajkumar | బాలనటుడిగా అవార్డులు..స్టార్ హీరోగా రికార్డులు
puneeth rajkumar | వయసు 46 ఏండ్లే.. కానీ 45 ఏళ్ల సినీ కెరీర్ ఆయన సొంతం
Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

