Puneet Raj Kumar: కర్ణాటకలో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. థియేటర్స్ బంద్

కన్నడిగులు ప్రత్యక్ష దైవంలా ఆరాధించే రాజ్‌కుమార్ మూడో కుమారుడు పునీత్ రాజ్ కుమార్ కొద్ది సేపటి క్రితం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్షేమంగా తిరిగి వస్తాడని అందరు ఊహించగా, అభిమానులకి నిరాశే ఎదురైంది.
రాజ్ కుమార్ మొదటి కుమారుడు శివరాజ్ కుమార్‌కు కన్నడ చలన చిత్ర సీమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. రెండో కుమారుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ మొదట్లో హీరోగా అనేక సినిమాల్లో నటించారు. ఆయనకు కూడా గుండెపోటు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఒక చెయ్యి పనిచేయదు.
పునీత్ ఇకలేరన్న విషయం తెలిసి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అభిమానులు భారీగా ఆసుపత్రికి తరలి వస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. అభిమానుల సందర్శనార్ధం కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతిక కాయం ఉంచనున్నారు.
టాప్ హీరోగా.. ఆయన కేరీర్ అత్యున్నత స్థితిలో ఉంది. వరుస సూపర్ హిట్స్‌తో శాండల్‌వుడ్ సినిమా స్థాయిని పెంచారాయన. ఇలాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో కన్నుమూయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండేలా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఇంటి వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

