పునీత్ రాజ్ కుమార్ పై 400 కోట్ల పెట్టుబడులు.. ఆ సినిమాల పరిస్థితి ఏంటి..?

Puneeth rajkumar movies | పునీత్ రాజ్ కుమార్ చిన్న హీరో కాదు.. ఆయన మరణం తర్వాత ఈ విషయం అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దేశ వ్యాప్తంగా వస్తున్న సంతాప సందేశాలు చూసిన తర్వాత పునీత్ రేంజ్ ఏంటనేది అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీలో ఈయన స్థాయి దాదాపు 100 కోట్లు దాటిపోయింది. పునీత్ చేసే ఒక సినిమా బడ్జెట్ 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంటుంది. దానికి తోడు ఈయన అగ్ర హీరో కావడంతో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండేవాడు. ఇప్పుడు కూడా ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి జేమ్స్ రెండోది ద్విత్వ. ఇందులో జేమ్స్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో బాడీ బిల్డర్‌గా నటిస్తున్నాడు పునీత్.
నిజానికి ఈ సినిమా కోసమే కొన్ని రోజులుగా కష్టపడుతున్నాడు. ఈయన గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నాడు. ఇలా వర్కవుట్స్ చేస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లు. ఈ సినిమాను చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. అంతలోనే ఆయన మరణించడంతో ఈ సినిమా భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. దాంతో పాటు పవన్ కుమార్ దర్శకత్వంలో ద్విత్వ అనే భారీ బడ్జెట్ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకున్నాడు పునీత్ రాజ్ కుమార్.
ఈ సినిమా బడ్జెట్ కూడా 60 కోట్లకు పైనే ఉంది. డిసెంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో పునీత్ మరణ వార్తకు మించిన షాక్ వాళ్లకు మరొకటి ఉండదు. ఇది మాత్రమే కాకుండా సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వంలో కూడా పునీత్ ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రాజకుమార, యువరత్న మంచి ఫలితాన్ని అందుకున్నాయి. దాంతో మూడో సినిమాకు ముహూర్తం పెట్టారు. అంతే కాకుండా పునీత్ తన హోమ్ బ్యానర్లో 5 సినిమాలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. దాంతో ఈ సినిమాల భవిష్యత్తు.. దాదాపు 400 కోట్ల పెట్టుబడులు ప్రశ్నార్థకంగా మారాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Puneeth Rajkumar | కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతి
పవర్ స్టార్ పునీత్‌ను హీరోగా పరిచయం చేసింది మన పూరీ జగన్నాథ్‌నే
పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుకు కారణం అదేనా?
Puneeth rajkumar movies పునీత్ రాజ్ కుమార్ చేసిన తెలుగు రీమేక్స్ ఇవే..
power star | పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే.. నన్ను అలా పిలవద్దు : పునీత్
రియల్ హీరో పునీత్ రాజ్ కుమార్.. ఆయన చేసి సేవల గురించి తెలుసా
గతేడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్.. కన్నడ సినిమాకు చీకటి రోజులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

