Jyothika: జ్యోతిక అందించిన ధైర్యం.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పిన తొమ్మిదేళ్ల బాధితురాలు

సినిమాల ప్రభావం ప్రజలపై తప్పక ఉంటుంది. కొందరు మంచిని స్వీకరిస్తే మరి కొందరు చెడుని స్వీకరిస్తుంటారు. తాజాగా జ్యోతిక సినిమాని చూసి తొమ్మిదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగినట్టు తల్లిదండ్రులకి చెప్పి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేసింది. వివరాలలోకి వెళితే ‘పొన్మగల్ వందాల్’ అనే కోర్టు డ్రామా చిత్రంలోనటించగా, ఈ సినిమా 2020లో విడుదలై మంచి విజయం సాధించింది.
‘పొన్మగల్ వందాల్’లో రేప్ కేసులు భారతదేశ న్యాయస్థానాలలో ఎలా డీల్ చేయబడుతున్నాయనే అంశం గురించి చిత్రీకరించారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో అన్ని విషయాల గురించి ధైర్యంగా చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పిన సన్నివేశం ఈ సినిమాలో ఉంది. దీనిని స్పూర్తిగా తీసుకున్నబాలిక 48 ఏళ్ల బంధువు వలన లైంగిక వేధింపులకి గురైనట్టు పేరెంట్స్కి చెప్పింది. వారు నిందితుడిపై ఫిర్యాదు చేశారు.
కేసుపై విచారణ చేసిన హైకోర్టు అతనికి ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలో జ్యోతిక స్పందిస్తూ… ‘నిశ్శబ్దాన్ని ఛేదించండి! ఒక మహిళ తనకు తానుగా అండగా నిలబడుతుంది. అంతే కాదు ఆమె అందరు మహిళల కోసం నిలబడుతుంది’ అన్నారు. కాగా, ‘పొన్మగల్ వందాల్’ చిత్రానికి జెజె ఫ్రెడ్రిక్ దర్శకత్వం వహించారు. హీరో సూర్య దీనిని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

