Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్

jai bhim fame lijomol jose | ఇప్పుడు ఎక్కడ చూసినా తమిళ హీరో సూర్య నటించిన జై భీమ్ గురించే టాపిక్. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య-జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మించారు. అమాయకులైన గిరిజనులపై కొందరు పోలీసులు అక్రమ కేసులు బనాయించి, నేరాలు ఒప్పుకునేందుకు ఎలాంటి చర్యలకు దిగుతారనే ఇతివృత్తంతో జై భీమ్ తెరకెక్కింది. గిరిజన వర్గాల హక్కుల కోసం పోరాడే లాయర్ చంద్రు పాత్రలో సూర్య కనిపించగా.. సమాజంలో దాష్టీకానికి బలై.. న్యాయపోరాటానికి దిగిన మహిళగా లిజోమోల్ జోస్ నటించింది. ఇప్పుడు వీరిద్దరి నటన గురించి సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చినతల్లి ( sinatalli ) పాత్రలో లిజోమోల్ జోస్ ( lijomol jose ) నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

తమిళనాడులోని కడలూరులో 1993లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో చినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పోలీసుల అరాచకానికి బలైన భర్త కోసం తల్లడిల్లిపోయే పేద గిరిజన యువతి చినతల్లి పాత్రలో జీవించేసింది. ఈ సినిమాలో ఆమె నటన చూసిన తర్వాత అసలు లిజోమోల్ ఎవరు అని చాలామంది ఆన్లైన్లో వెతుకుతున్నారు. కానీ ఆమె ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను పరిచయమైంది. ఒరేయ్ బామ్మర్ది సినిమాలో సిద్ధార్థ్‌కు జోడీగా నటించింది ఈమేనని తెలిసి షాకవుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో లిజోమోల్ మాట్లాడుతూ. చినతల్లి ( sinatalli ) పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

సినిమా షూటింగ్ అయిపోయాక కూడా చినతల్లి పాత్రలో నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయానని లిజోమోల్ చెప్పింది. ఆ పాత్ర తాలూకు ఎమోషన్.. చినతల్లి అనుభవించిన బాధ, ఆవేదన ఇప్పటికీ తనలోనే ఉండిపోయాయని చెప్పుకొచ్చింది. గతంతో చేసినా ఏ పాత్రలు కూడా తనను ఇంతలా ప్రభావితం చేయలేదని పేర్కొంది. ఇక కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశానని.. డైరెక్టర్ కట్ చెప్పినా కూడా కన్నీళ్లు ఆగలేదని వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Suriya | సూర్యపై తమిళ డిస్ట్రిబ్యూటర్ల ఆగ్రహం.. ఎందుకంటే..
Jai bhim | ఇదే కదా సూర్య.. నీ నుంచి మేం కోరుకునేది అంటున్న ఫ్యాన్స్..
Puneet Raj Kumar: అప్పు అభిమానులు ఆత్మహత్యలు చేసుకోవడంపై స్పందించిన పునీత్ భార్య
Pushpa: హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

