Pushpa: హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!

సౌత్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాత్రమే డైరక్ట్ గా రిలీజ్ అవుతుందని.. హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కు ఇబ్బందులు ఎదుర్కొంటోందని సమాచారం.
పుష్ప సినిమాని పాన్ ఇండియా చిత్రంగా అనుకోకముందు తెలుగు,మళయాళంలో రిలీజ్ చేద్దామని ‘పుష్ప’ హిందీ డబ్బింగ్ హక్కుల్ని అమ్మేసారట. పాన్ ఇండియా సినిమా అయిన తరువాత హిందీ హక్కులు కొనుక్కున్న వ్యక్తి థియేటర్లలో విడుదలకు అంగీకరించడం లేదు. పబ్లిసిటీ, థియేటర్ ఖర్చులు మైత్రీ మూవీస్ నే పెట్టుకుని, పర్సంటేజ్ ఇస్తే థియేటర్ విడుదలకు అంగీకరిస్తానని అంటున్నారట.ఇలా చేస్తూ మైత్రిమూవీస్కి నష్టంగా తెలుస్తుంది.
గీతా ఆర్ట్స్ ద్వారా ఈ సమస్యని సాల్వ్ చేద్దామని చూసినా కాలేదట. దీంతో పుష్ప చిత్రం హిందీలో విడుదల కావడం కష్టమేనని, ఈ సినిమాతో ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెడదామనుకున్న కల కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల విడుదలైన సామి సామి సాంగ్ హిందీలో విడుదల కాకపోవడంతో పుష్ప హిందీలో రిలీజ్ కావడం కష్టమేనంటున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- pushpa
- sukumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

